ఆ బీఆర్ఎస్ అధినేతకు కుటుంబం కన్నా పార్టీయే ముఖ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి(Mallareddy) పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో గొడవలు సహజమని, అలాగని అవి తెగేవరకు లాగవద్దని చెప్పారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో కేసీఆర్ ఎంత కఠినంగా ఉంటారో ఈ చర్యతో మరోసారి స్పష్టమైందని ఆయన అభిప్రాయపడ్డారు.
కుటుంబం కోసం పార్టీని నాశనం చేసుకోరు. మల్లారెడ్డి(Mallareddy) బోయినపల్లిలోని వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కవిత సస్పెన్షన్ పై స్పందిస్తూ, ‘ప్రతి కుటుంబంలో గొడవలు రావడం సహజం. అలాగే దేశంలోని ప్రతిపార్టీలో ఇలాంటి సస్పెన్షన్లు జరుగుతుంటాయి. కేసీఆర్ కు తెలంగాణ ప్రజల శ్రేయస్సే ముఖ్యం. తన కుటుంబ సభ్యుల కోసం ఆయన పార్టీని నాశనం చేసుకోలేరు’ అని మల్లారెడ్డి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏమిటి?
గత ఎన్నికల్లో ఊహించని పరాజయం పొందిన కేసీఆర్(KCR) ఓటమిని జీర్ణించుకోలేకుండా ఉన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ జాతీయస్థాయిలో కూడా ఎదిగేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్(BRS) పార్టీగా మార్చారు. పార్టీ ఓటమి తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువాను వేసుకున్నారు.
ఓటమి తర్వాత కేసీఆర్ ఇంట్లో కిందపడి ఎముక విరగడం, కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో ప్రజల్లోకి ఎక్కువగా రాలేకపోతున్నారు. దీనికి తోడు వయసు మీదపడడంతో బీఆర్ఎస్ నాయకత్వ పగ్గాలు ఎవరికి ఇస్తారనే చర్చలు కూడా వచ్చాయి.
ఆపార్టీపై కాళేశ్వరం, ఫోన్ట్యపింగ్ వంటి కేసులతో కేసీఆర్, కేటీఆర్(KTR) సతమతమవుతున్న సమయంలో కవిత ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందిగానే పరిణమించింది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా, ముందుముందు పలు సవాళ్లను ఎదుర్కొవాల్సిన పరిస్థితిలో బీఆర్ఎస్(BRS) పార్టీ ఉంది.
Read Hindi news: Hindi.vaartha.com
Read Also: