హైదరాబాద్ BJP : అధికారిక పర్యటనలో భాగంగా మంగళవారం కర్ణాటకలోని బెళగావి జిల్లాకు విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్కు స్థానిక ఎమ్మెల్యే, బిజెపి తెలంగాణ ఇన్ఛార్జి అభయ్ పాటిల్ వెన్నంటి ఉన్నారు. ఉదయం బెళగావి ఎయిర్‌పోర్టులో బిజెపి నాయకులతో కలిసి అభయ్ పాటిల్ ఘన స్వాగతం పలికారు. సాయంత్రం పర్యటన ముగిసే వరకు ఆయనతో పాటు ఉన్నారు.
సిఆర్పిఎఫ్ కోబ్రా స్కూల్ కార్యక్రమంలో పాల్గొనడం
తొలుత ఎయిర్‌పోర్టు నుండి అభయ్ పాటిల్‌తో కలిసి బెళగావి జిల్లాలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కు చెందిన కోబ్రా స్కూల్ ఆఫ్ జంగిల్ వార్‌ఫేర్ అండ్ టాక్టిక్స్ (CSJWT) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం అభయ్ పాటిల్ ఆహ్వానం మేరకు బెళగావి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసానికి వెళ్లారు.
కార్యకర్తలతో భేటీ మరియు పర్యటన ముగింపు
అక్కడికి భారీగా తరలివచ్చిన బిజెపి నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు తొలిసారి బెళగావికి విచ్చేసిన బండి సంజయ్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభయ్ పాటిల్ ఆయా నాయకులను పరిచయం చేశారు. వందలాది మంది కార్యకర్తలు సంజయ్, అభయ్ పాటిల్‌తో ఫోటోలు దిగారు. అనంతరం భోజనం చేసిన బండి సంజయ్, కార్యకర్తలకు అభివాదం చేసి బెళగావి ఎయిర్‌పోర్టుకు చేరుకుని హైదరాబాద్ మీదుగా కరీంనగర్ బయలుదేరారు.
బండి సంజయ్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు?
బెళగావి జిల్లాలోని CRPF కోబ్రా స్కూల్ ఆఫ్ జంగిల్ వార్‌ఫేర్ అండ్ టాక్టిక్స్ (CSJWT) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ పర్యటనలో ఆయనతో ఎవరు ఉన్నారు?
బిజెపి తెలంగాణ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే అభయ్ పాటిల్ పర్యటన మొత్తం ఆయనతో ఉన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Read also :