తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Telangana Governor Jishnu Dev Verma) కొడుకు ప్రతీక్ దేవ్ తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని త్రిపుర రాష్ట్రం ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ త్రిపురలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో గొడవ చేస్తున్న ముగ్గురిని బయటకి వెళ్లమని చెప్పినందుకు, ప్రతీక్ దేవ్ వర్మతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు తనను చంపేస్తామని బెదిరించారనిపోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపు
కాగా త్రిపుర రాష్ట్రానికి చెందిన టీఎంపీ పార్టీ ఎమ్మెల్యే ఫిలిప్ రియాంగ్ (TMP Party MLA Philip Ryang) 400-500 బీజేపీకార్యకర్తలను తీసుకొచ్చి తనను, తన కుటుంబం మొత్తాన్ని హతమారుస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కాగా ఎమ్మెల్యేఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: