Road Accident: ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగంలో చేరి, ఆర్థికంగా తమను ఆదుకుంటారనే గంపెడు ఆశతో పిల్లల్ని చదివిస్తారు తల్లిదండ్రులు. రెక్కలు ముక్కలు చేసుకుని, కడుపు కాల్చుకుని, బిడ్డల్ని ఉజ్వల భవితకు బాటలు వేస్తారుకన్నవారు. కానీ అనుకోని ఉపద్రవంతో ఆ పిల్లలు ఊహించని ప్రమాదానికి(danger) గురై, మరణిస్తే ఆ ఆవేదన వర్ణించలేనిది.

వినాయక నిమర్జనంలో విషాదం
లండన్(London) లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ వాసులు మరణించారు. వినాయక నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతులను నాదర్ గుల్ కు చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్ కు చెందిన రిషితేజ (21)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారంతా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. తమ బిడ్డలు ఉన్నత చదువులు చదివి తమను ఉద్దరిస్తారని అనుకుంటే మత్యువుఒడిలోకి చేరుకున్నారని మరణించిన వారి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. చెట్టంత ఎదిగిన కొడుకులు ఇలా తమకళ్లముందే చనిపోయారంటే విలపిస్తున్నారు. కాగా గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు తమ బిడ్డలు ప్రాణాలతో బయటపడాలని దేవుడిని వేడుకుంటున్నారు. ప్రస్తుతం గాయపడ్డవారికి మెరుగైన చికిత్సలు కొనసాగుతున్నాయి.
ప్రమాదంలో మరణించినవారు ఎవరు?
పులిచెర్ల సాయి సిద్ధార్థ్ (20) మరియు లోకేశ్వరి పల్లెపోగు (22) అనే ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు.
మృతులు ఏ రాష్ట్రానికి చెందినవారు?
వీరు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందినవారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :