Lokah Chapter 1 వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్
Lokah Chapter 1 : వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ ఇప్పటికే ₹100 కోట్ల మార్క్ వైపు దూసుకుపోతోంది. సోమవారం (5వ రోజు) కూడా కలెక్షన్స్‌లో పెద్దగా తగ్గుదల లేకుండా అదరగొట్టింది. Lokah Chepter 1 కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మలయాళ సూపర్ హీరో సినిమా శక్తివంతమైన వర్డ్ ఆఫ్ మౌత్ తో మంచి వసూళ్లు సాధిస్తోంది.
5 రోజుల్లో కలెక్షన్స్
- భారత్‌లో ఇప్పటివరకు ₹31.05 కోట్లు నెట్ (₹36.20 కోట్లు గ్రాస్) వసూలు చేసింది.
- సోమవారం మాత్రమే ₹6.65 కోట్లు నెట్ వసూలు చేయగా, ఇది ఆదివారం వసూళ్ల (₹10.10 కోట్లు)తో పోలిస్తే కేవలం 35% మాత్రమే తగ్గింది.
- విదేశాల్లో $5 మిలియన్ (సుమారు ₹45 కోట్లు) వసూలు చేసింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యం మరియు ఉత్తర అమెరికాలో కలెక్షన్లు బలంగా ఉన్నాయి.
- మొత్తం 5 రోజుల్లో వరల్డ్‌వైడ్ కలెక్షన్ ₹81 కోట్లు చేరింది. బుధవారం నాటికి ₹100 కోట్లు దాటే అవకాశం ఉంది.
రికార్డులు బ్రేక్ చేసిన Lokah Chapter 1
సోమవారం ఒక్కరోజే ₹15 కోట్లు వరల్డ్‌వైడ్ వసూలు చేయడంతో, ఈ సినిమా మలయాళ హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లిస్ట్‌లో 6 స్థానాలు ఎగబాకింది.
- Alappuzha Gymkhana (₹68 కోట్లు)
- Romancham (₹70 కోట్లు)
- Turbo (₹73 కోట్లు)
- Premam (₹73 కోట్లు)
లాంటి బ్లాక్‌బస్టర్‌లను ఈ సినిమా దాటేసింది.
సినిమా గురించి
Dominic Arun దర్శకత్వంలో, Dulquer Salmaan నిర్మించిన ఈ సినిమా ద్వారా Wayfarer Cinematic Universe ప్రారంభమైంది. ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్ర “చంద్ర”గా నటించగా, నస్లెన్, శాండీ అരുൺ కురియన్, చంద్రు సలీంకుమార్, నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలేరి, విజయరాఘవన్, నిత్యా శ్రీ, శరత్ సభ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ప్రశంసలు లభిస్తున్నాయి.
Read also :