భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మంగళవారం మరియు బుధవారం రోజుల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, భారత వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert)జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మత్స్యకారులకు హెచ్చరిక
శుక్రవారం రోజున సముద్రం ప్రభావితంగా ఉండే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఐఎండీ హెచ్చరించింది. అలలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్న ప్రమాదం ఉండే అవకాశం ఉంది.
ఏపీఎస్‌డీఎంఏ విశ్లేషణలు
ఏపీఎస్‌డీఎంఏ (APSDMA) ప్రకారం, ఈశాన్య బంగాళాఖాతం మీదుగా మయన్మార్ తీరం వరకు ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించిఉంది. దీని ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు.
మరిన్ని జిల్లాల్లో వర్ష సూచన
రేపు (సెప్టెంబర్ 2) విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని ఏపీఎస్‌డీఎంఏ వెల్లడించింది.
ప్రజలకు సూచనలు
ప్రజలు వాతావరణ శాఖ సూచనలను అనుసరించాలని, భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. పక్కా నివాసాలలో ఉండాలని, రహదారులపై ప్రయాణాలను అనవసరంగా నివారించాలని సూచించారు.
read hindi news:hindi.vaartha.com
Read also: