ఉప్పల్ వర్క్‌షాప్‌ను కరీంనగర్‌కు తరలింపు నిర్ణయం
హైదరాబాద్ : ఉప్పల్‌లో ఉన్న ఆర్టీసీ(TSRTC Work Shop)జోనల్ వర్క్‌షాప్‌ను కరీంనగర్(Karimnagar) జోనల్ వర్క్‌షాప్‌కు తరలించాలని యాజమాన్యం నిర్ణయించింది. అలాగే మియాపూర్‌లోని బస్ బాడీ అండ్ వర్క్‌షాప్ (బిబిడబ్ల్యూ)ను కూడా కరీంనగర్‌కు మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
కమిటీ చర్చలు
వర్క్‌షాప్‌ల సెంట్రలైజేషన్ అంశంపై ఆర్టీసీ(TSRTC Work Shop) ఐదుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఆగస్టు 19న బస్ భవన్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశమైంది. సిఎంఈ సిహెచ్. వెంకన్న, సిఎఫ్ఎం బిసివి పుష్పకుమారి, సిపిఎం టి. ఉషాదేవి, సిసిఎస్ ఎంఈ ప్రభులత, సిసిఈ ఆర్. కవిత సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఉప్పల్ వర్క్‌షాప్, మియాపూర్ బిబిడబ్ల్యూను కరీంనగర్‌కు తరలించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
కార్మిక సంఘాల వ్యతిరేకత
ఉప్పల్ వర్క్‌షాప్(Uppal Workshop), మియాపూర్ బిబిడబ్ల్యూ యూనిట్లను తరలించకుండా హైదరాబాద్‌లోనే కొనసాగించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మియాపూర్ వర్క్‌షాప్ 18 ఎకరాల భూమిపై 155 మంది సిబ్బందితో పనిచేస్తోంది. గజం విలువ ప్రస్తుతం రూ. 2 లక్షలుగా ఉండటంతో, ఇంత ఖరీదైన భూమిని ఇతరులకు అప్పగించేందుకే తరలింపు చేస్తున్నారని సంఘాలు ఆరోపిస్తున్నాయి.
నైపుణ్యంతో పనిచేస్తున్న కార్మికులు
మియాపూర్ బిబిడబ్ల్యూ వర్క్‌షాప్‌లో కొత్త బస్సులు తయారై డిపోలకు పంపబడతాయి. నైపుణ్యం గల కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్ 16 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు 355 మంది సిబ్బందితో పనిచేస్తోంది. హైదరాబాద్ జోన్లోని 55 డిపోల బస్సులు ఓవర్‌హాల్ కోసం, మెటీరియల్ కోసం ఈ వర్క్‌షాప్‌కి వస్తుంటాయి.
యాజమాన్యం నిర్ణయమా? ప్రభుత్వ ఆదేశమా?
ఉప్పల్, మియాపూర్ వర్క్‌షాప్‌లను కరీంనగర్‌కు తరలించాలనే నిర్ణయం నిజంగా ప్రభుత్వానిదా లేక ఆర్టీసీ యాజమాన్యం స్వతహాగా తీసుకున్న నిర్ణయమా? అని సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
ఆర్టీసీ ఉప్పల్ వర్క్ షాప్‌ను కరీంనగర్‌కు ఎందుకు తరలిస్తున్నారు?
వర్క్ షాపుల సెంట్రలైజేషన్ కోసం ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.
కార్మిక సంఘాలు ఉప్పల్, మియాపూర్ వర్క్ షాపులను తరలించడంపై ఎలా స్పందిస్తున్నాయి?
యూనియన్లు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, హైదరాబాదులోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉప్పల్ వర్క్ షాప్‌లో ప్రస్తుతం ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు?
ఉప్పల్ వర్క్ షాప్, జోనల్ స్టోర్లలో కలిపి సుమారు 355 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
Read hindi news: Hindi.vaartha.com
Read also: