ప్రస్తుతం యువత ఆన్లైన్ గేమింగ్ పట్ల ఆకర్శితులౌతున్నారు. సరదాగా మొదలుపెట్టిన ఈ గేమింగ్ వ్యసనంగా మారి వారి ప్రాణాలను సైతం హరించివేస్తోంది. దేశవ్యాప్తంగా వారానికి కనీసం వంద మందికిపైగా ఆన్లైన్ గేమింగ్ బారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. పైగా ఈ ఆన్లైన్ గేమింగ్ ప్రముఖ సినీ నటులు, పేరొందిన ఇన్ఫ్లూయెన్సర్లు కూడా మద్దతుగా ప్రకటనలు చేయడంతో మరింత ఎక్కువ సంఖ్యలో ప్రజలు వీటి బారిన పడుతున్నారు. ఈ అన్లైన్ గేమింగ్‌ను పూర్తి స్థాయిలో అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ యాప్ పై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి ఈ గేమ్స్ వల్ల కలుగుతున్న నష్టాలకు సంబంధించి పూర్తి నివేదికను సిద్దం చేసుకుంది.
ఆన్లైన్ గేమ్ పూర్తిగా నిషేధించడానికి
ఆన్లైన్ గేమ్ పూర్తిగా నిషేధించడానికి వీలుగా ‘ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ను అద్దుకోవడం, ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయడమే దీని ప్రధాన లక్ష్యాలు. గేమింగ్ యాప్‌ల నిర్వాహకులపైనా, దానికి మద్దతుగా ప్రకటనలు చేసి యువతను ఆకర్శిస్తున్న సినీ నటులు, ప్రముఖ ఇన్ప్వూయెన్సర్లపై కూడా కఠినంగా(Strictly) వ్యవహరించి, న్యాయస్థానాల్లో శిక్షలు వేసేందుకు అవకాశం కలుగుతుంది. గత కొన్ని నెలల్లో ఆన్లైన్ గేమింగ్ యాప్‌లతో ముడిపడిన మోసపూరిత వ్యవహారాలు పెద్దసంఖ్యలో వెలుగులోకి వచ్చాయి. వాటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై దర్యాప్తు సంస్థలు కొరడా ఝుళిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో అనేక మంది సెలబ్రిటీలను (Celebrities) పోలీసు అధికారుల ప్రత్యేక బృందం ప్రశ్నిస్తోంది. వారి బ్యాంకు అకౌంట్లోను పరిశీలించి గేమింగ్ యాప్స్ నుంచి ఏ మేరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న అంశంపై పరిశీలన జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ బెట్టింగ్‌ను, దానికి వేదికగా నిలిచే యాప్‌కు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లను కేంద్రం పూర్తిగా నిషేధం విధించే అవకాశం ఉంది. ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ యాప్‌లకు యువత బానిసలుగా మారుతున్నారు. తమ విలువైన డబ్బును బెట్టింగ్‌లో పెట్టి ఆర్థికంగా దివాలా తీస్తున్నారు, రియల్ మనీ గేమింగ్ యాప్‌లు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో ఆకట్టుకునే యాడ్లు, ప్రజల్లో ఈజీ మనీ ఆశలను పెంచుతున్నాయి. వీటిని నిజమేనని నమ్మి ఎంతోమంది యువత రియల్ మనీ గేమింగ్ యాప్‌లో బెట్టింగ్ కాస్తున్నారు. చివరకు ఈ వ్యసనపు ఊబిలో కూరుకుపోతున్నారు. పలు రియల్ మనీ గేమ యాప్‌లు ఆర్థిక మోసాలకు, ఇతరత్రా అవకతవకలకు గురువుతున్న దాఖలాలు కూడా గత కొన్ని నెలల్లో వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం నుంచి యువతను రక్షించే లక్ష్యంతో ఆన్లైన్ గేమింగ్ బిల్లుఖీను కేంద్రం ప్రభుత్వం రూపొందించింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినా, యాడ్లను ప్రచారంలోకి తెచ్చినా బాధ్యులకు జరిమానాలు, శిక్షలను విధించాలనే ప్రతిపాదన ఉంది. దీనితో ఈ యాడ్లను పూర్తిగా నిషేధించే ఛాన్స్ ఉంది.

రియల్ మనీ గేమింగ్ యాప్‌లకు
రియల్ మనీ గేమింగ్ యాప్‌లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు బ్యాంకులు, ఆర్థిక సేవా సంస్థలు వేదికగా మారకూడదనే నిబంధన బిల్లులో ఉండే అవకాశం ఉంది. స్కిల్, ఛాన్స్ అనే అంశాలతో సంబంధం లేకుండా డబ్బుతో జరిగే అన్ని రకాల ఆన్లైన్ రియల్ మనీ గేమ్‌లను, బెట్టింగ్ యాప్‌లను ప్రత్యేక కేటగిరీ కింద కేంద్రం ప్రభుత్వం వర్గీకరించే అవకాశం ఉంది. ఈ లెక్కన డబ్బుతో ముడిపడిన లావాదేవీలు కలిగిన పోకర్‌బాజీ, రమ్మీ, డ్రీమ్ 11, ఎంపీఎల్, పారిమ్యాచ్ వంటి ప్రసిద్ధ ఆన్లైన్ కార్డ్ గేమ్ ప్లాట్ ఫామ్ కూడా ఉండే అవకాశం ఉంది. భారత్ లో ఆన్లైన్ గేమింగ్ పై ప్రభుత్వ సంస్థగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖను నియమించాలనే ప్రతిపాదన ఉంది. గతంలోనూ ఈ విషయాన్ని ఇదే శాఖ పర్యవేక్షించేది. ప్రస్తుతం బిల్లును తీసుకురావడం ద్వారా ఆన్లైన్ గేమింగ్ ను భారతదేశంలో పూర్తిగా అడ్డుకట్ట వేయాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.
Read also: hindi.vaartha.com
Read also: