టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన కెరీర్ మొత్తం టీమిండియాను ఎన్నో శిఖరాగ్రాలకు చేర్చిన ధోనీ, నేటికీ క్రికెట్ అభిమానుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాడు. కూల్ మైండ్‌సెట్, ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చగల సత్తా, చివరి బంతివరకు పోరాడే జోష్.. ఇవన్నీ ధోనీని ప్రత్యేకంగా నిలిపాయి. ఇప్పుడు అదే ధోనీని మరోసారి టీమిండియా మెంటార్‌గా తీసుకురావాలని బీసీసీఐ ఆలోచిస్తోంది అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఇప్పటికే 2021లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో ధోనీని బీసీసీఐ తాత్కాలిక మెంటార్‌గా నియమించింది. ఆ సమయంలో అతని ప్రణాళికలు, వ్యూహాలు ఆటగాళ్లకు బాగా ఉపయోగపడ్డాయి. అయితే ఆ టోర్నమెంట్ తరువాత ధోనీకి ఎలాంటి బాధ్యత ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం బీసీసీఐ (BCCI) దీర్ఘకాల వ్యూహంతో ముందుకు వెళ్ళాలని భావిస్తోంది. కేవలం ఒక టోర్నీ వరకే కాకుండా, భవిష్యత్తు కోసం ధోనీ అనుభవాన్ని ఉపయోగించుకోవాలి అని నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది.
ధోనీ నిర్ణయం ఏంటనేది చూడాలి
ప్రస్తుతం చర్చనీయాంశం ఏంటంటే – బీసీసీఐ ఆఫర్‌ను ధోనీ స్వీకరిస్తాడా లేదా? ఎందుకంటే ధోనీకి ఐపీఎల్ తప్ప మిగతా క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్మెంట్ ఉంది. కుటుంబం, వ్యక్తిగత జీవితం, వ్యాపారాలతో బిజీగా ఉన్నాడు. మెంటార్ బాధ్యతలు అంటే ఎక్కువ సమయం, కట్టుబాట్లు అవసరం అవుతాయి. కాబట్టి ధోనీ నిర్ణయం ఏంటనేది చూడాలి. అయితే ధోనీ మెంటార్‌గా వస్తే ఆటగాళ్లకు ఎంతో మేలని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న గౌతం గంభీర్ (Gautam Gambhir) ఇందుకు అంగీకరిస్తాడా? అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మెంటార్ ధోనీ విషయంలో గంభీర్ సానుకూలంగా ఉండకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు ధోనీ అంటేనే గంభీర్‌కు పడదు.

విజయాలు దక్కుతుందని చెప్పే గంభీర్
ధోనీ సారథ్యంలో భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ 2011 జట్లలో గంభీర్ కూడా సారథిగా ఉన్నాడు. ఈ రెండు టోర్నీల ఫైనల్లో గంభీర్ మెరుగైన ప్రదర్శన చేశాడు. కానీ ఈ గెలుపు క్రెడిట్ మొత్తం ధోనీకే దక్కిందని గంభీర్ అనేక ఇంటర్వ్యూల్లో అసంతృప్తి వ్యక్తం చేశాడు. సమష్టిగా రాణిస్తేనే విజయాలు దక్కుతుందని చెప్పే గంభీర్.. ధోనీని మెంటార్‌గా నియమించేందుకు స్వీకరిస్తాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇటీవల ఈ ఇద్దరూ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీడియో వైరల్‌గా మారింది.ఐదేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ప్రస్తుతం 44 ఏళ్లు ఉన్న ధోనీ.. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడుతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ధోనీ మాత్రం తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. సీజన్ ప్రారంభానికి ముందు తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పాడు.
ఎంఎస్ ధోనీ పూర్తి పేరు ఏమిటి?
మహేంద్ర సింగ్ ధోనీ.
ధోనీ ఎప్పుడు, ఎక్కడ జన్మించాడు?
1981 జూలై 7న, జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జన్మించాడు.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: