ములుగు జిల్లాలో వర్షాల ఉధృతి
ములుగు జిల్లా : గత రెండు రోజులుగా ములుగు జిల్లాల(Mulugu District) కురుస్తున్న వర్షాలకి జిల్లాలోని లో లెవల్ వంతెనలు, లోతట్టు ప్రాంతాల రహదారులు వరద ఉధృతికి ధ్వంసమై జిల్లాకి తీరని నష్టం మిగిల్చాయి. 163వ జాతీయ రహదారిపై ఉన్న మొండ్యల తోగు, జలగలంచ వాగులప్రవాహానికి జాతీయ రహదారిపై ప్రయాణం ప్రస్తుతానికి ప్రాణ సంకటంగా మారింది. రోడ్ల ధ్వంసంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వరి పంట జిల్లావ్యాప్తంగా సుమారు 1500 ఎకరాలకు పైగా వరద ముంపు కి గురైనట్టు సమాచారం. జిల్లా అధికార యంత్రాంగం ఇంకా ఈ అంశంపై అధికా రిక ప్రకటన చేయలేదు.


రైతులపై విపత్తు ప్రభావం
Mulugu District: మంగపేట మండలం(Mangapet Mandal)మొదలుకొని వెంకటాపూర్ మండలం వరకు మత్తడి పోస్తున్న చెరువుల నీటి ప్రవాహంతో వందల ఎకరాలలో ఇసుక మేటలు వేసి రైతుల పాలిట ఈ అకాల వర్షాలతో వచ్చిన వరదలు కోలుకోలేని నష్టం మిగిల్చాయని అన్నదాత ఆవేదన చెందుతున్నాడు.
గోదావరి ఉధృతి మరియు రహదారి నిలిపివేత
అంతర్రాష్ట్ర సరిహద్దు జాతీయ రహదారిని చుట్టు ముట్టిన గోదారి.. అంతర్ జిల్లా సరిహద్దులకి జంక్షన్‌గా ఉన్న వాజేడు మండలంలో లోతట్టు ప్రాంతాలను గోదావరి చుట్టుముట్టేసింది. జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం ఆదేశాలతో స్థానిక పోలీస్ శాఖ గోదావరి ముంపుతో నీట మునిగిన రోడ్ల వద్ద ప్రమాదహెచ్చరిక సూచికలు ఏర్పాటుచేసి అనుక్షణం గస్తీ కాస్తున్నారు.
రాకపోకలపై అంతరాయం
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీవర్షాలవలన(heavy rains) గోదావరిలోకి భారీగానీరు చేరడంతో పలుచోట్ల జల దిగ్బంధ నంలో చిక్కుకున్నాయి. టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేర డంతో అంత రాష్ట్రీయ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చీకుపల్లి కాజ్వే పైకి, గుమ్మడిదొడ్డి, వాజేడు మధ్యలో ఉన్న కొంగాల కాజ్వే పైకి, బొమ్మనపల్లి, ఏడ్జర్లపల్లి వద్ద బ్రిడ్జి పైకి నీరు రావడంతో రాకపోకలకు అంత రాయం ఏర్పడడంతోపాటు మండల కేంద్రం రావడానికి రాకపోకలు నిలిచిపోయాయి.
ములుగు జిల్లాలో ఏ రహదారి ప్రమాదకరంగా మారింది?
163వ జాతీయ రహదారి మొండ్యల తోగు, జలగలంచ వద్ద ప్రమాదకరంగా మారింది.
వరదల వల్ల ఎంత పంట నష్టం జరిగింది?
సుమారు 1500 ఎకరాలకు పైగా వరి పంట వరద ముంపుకు గురైంది.
గోదావరి ఉధృతితో ఏ ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి?
వాజేడు మండలం లోతట్టు ప్రాంతాలు గోదావరి ముంపులో చిక్కుకున్నాయి.
రాకపోకలకు ఎక్కడ అంతరాయం ఏర్పడింది?
టేకులగూడెం, చీకుపల్లి కాజ్వే, గుమ్మడిదొడ్డి, వాజేడు, కొంగాల కాజ్వే, బొమ్మనపల్లి, ఏడ్జర్లపల్లి వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Read hindi news: Hindi.vaartha.com
Read also: