News Telugu: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) తాజాగా దేశ వ్యాప్తంగా ఉన్న రీజియన్లలో పారా మెడికల్ (Para medical) విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 434 పోస్టులు ఈ ప్రకటన కింద భర్తీ చేయబోతున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ కింద విభాగాల వారీగా పోస్టుల సంఖ్య ఇలా ఉంది:
- నర్సింగ్ సూపరింటెండెంట్ (Nursing Superintendent)– 272
- డయాలిసిస్ టెక్నీషియన్ – 4
- హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్-2 – 33
- ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) – 105
- రేడియోగ్రాఫర్/ఎక్స్‌రే టెక్నీషియన్ – 4
- ఈసీజీ టెక్నీషియన్ – 4
- లాబోరేటరీ టెక్నీషియన్ గ్రేడ్-2 – 12

అర్హతలు
ప్రతి పోస్టుకు అనుగుణంగా విద్యార్హతలు నిర్ధారించారు.
- నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులకు B.Sc నర్సింగ్
- ఫార్మసిస్ట్ పోస్టులకు ఫార్మసీ డిప్లొమా లేదా డిగ్రీ
- రేడియోగ్రఫీ పోస్టులకు రేడియోగ్రఫీ డిప్లొమా/డిగ్రీ
- ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు డీఎంఎల్టీ (Diploma in Medical Laboratory Technology)
- ఇతర పోస్టులకు సంబంధిత విభాగంలో టెన్+2, డిప్లొమా లేదా డిగ్రీ అర్హత తప్పనిసరి.
వయోపరిమితి
2026 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు ఈ విధంగా ఉండాలి.
- నర్సింగ్ సూపరింటెండెంట్: 20–40 ఏళ్లు
- డయాలిసిస్ టెక్నీషియన్: 20–33 ఏళ్లు
- హెల్త్ & మలేరియా ఇన్‌స్పెక్టర్: 18–33 ఏళ్లు
- ఫార్మసిస్ట్: 20–35 ఏళ్లు
- రేడియోగ్రాఫర్: 19–33 ఏళ్లు
- ఈసీజీ టెక్నీషియన్: 18–33 ఏళ్లు
- లాబోరేటరీ టెక్నీషియన్: 18–33 ఏళ్లు
దరఖాస్తు ప్రక్రియ
- అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 8, 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు ఫీజు:
- జనరల్, OBC, EWS – రూ.500
- SC, ST, మైనారిటీ, EBC, PwBD, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మాజీ సైనికులు – రూ.250
- దరఖాస్తు సవరణకు సెప్టెంబర్ 11 నుంచి 20 వరకు అవకాశం ఉంటుంది.
ఎంపిక విధానం
తుది ఎంపిక ఆన్‌లైన్ రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
ఎంపికైన వారికి పోస్టుల వారీగా జీతం ఈ విధంగా ఉంటుంది:
- నర్సింగ్ సూపరింటెండెంట్ – ₹44,900/-
- డయాలిసిస్ టెక్నీషియన్, హెల్త్ & మలేరియా ఇన్‌స్పెక్టర్ – ₹35,400/-
- ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్ – ₹29,200/-
- ఈసీజీ టెక్నీషియన్ – ₹25,500/-
- లాబోరేటరీ అసిస్టెంట్ – ₹21,700/-
Read hindi news: hindi.vaartha.com
Read also: