తిరుమల Environment : శేషాచలంఅటవీప్రాంతాన్ని పూర్తిగా పచ్చదనం పెంపొందించడంతో బాటు పర్యావరణం పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) శ్రీకారం చుట్టింది. సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాలతో శేషాచలం అడవిని, తిరుమల అటవీప్రాంతాన్ని మరింత పచ్చదనం పెంపొందించే చర్యలు చేపడుతున్నారు. తిరుమలలో అటవీ వృక్షసంపద, మానవ వన్యప్రాణుల సంఘర్షణ నివారణ చర్యలపై టిటిడి జెఇఒ వీరబ్రహ్మం, డిఎఫ్ ఫణికుమార్నాయుడుతో ఇఒ శ్యామలరావు సమీక్షించారు. గత ఏడాది తిరుమలలో చేపట్టిన వృక్షారోహణ కార్యక్రమాలు, అకేసియా ఆరికులిఫార్మిస్ వృక్షాల స్థానంలో స్థానిక వృక్షజాతుల పెంపకం, ఔషధవనాల వృద్ధి, సుస్థిర అటవీపునరుద్దరణ చర్యలపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. గత ఏడాదిలో లక్ష్యంగా పెట్టుకున్న 20వేల మొక్కల్లో ఇప్పటివరకు రావి, తాండ్ర, ఉసిరి, వెలగ, జువ్వి, మర్రి, నేరేడు, ఎర్రచందనం వంటి జాతులు 7వేల మొక్కలు నాటడం జరిగిందన్నారు. వన్యప్రాణుల కదలికల్లో భాగంగా అలిపిరి-తిరుమల మార్గాల ఇరువైపులా 60 ట్రాప్క్మెరాలు, 31 సౌరశక్తితోనడిచే యాక్టివ్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తుల రద్దీ (Crowd of devotees) ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలపై పర్యవేక్షణ ఉందన్నారు. తిరుమలకు సమగ్ర పర్యావరణ సుస్థిర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :