విజయవాడ Court : వైఎస్సార్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి (Pinnelli Ramakrishna Reddy) సోదరులకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జంట హత్య కేసులో రామకృష్ణా రెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిష న్లను కొట్టేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజక వర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు (TDP leaders) జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య ఘట నలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ6, వెంకట్రా మిరెడ్డి ఏ7 నిందితులుగా ఉన్నారు. ఈ ఘటనలో పిన్నెల్లి సోదరుల పాత్ర ఉందని పోలీసుల తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీని వాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. హత్య ఘటనలో పిన్నెల్లి సోదరుల కుట్ర, ప్రోద్బలం ఉందన్నారు. నిందితులు ఓ రెస్టారెంట్లో సమావేశమై హత్యకు కుట్రపన్నారన్నారు. హత్య ఘటనలో పాల్గొన్న వ్యక్తులతో పిన్నెల్లి సోదరులు ఫోన్లో మాట్లాడారని, వాటికి సంబంధించి సాంకేతిక ఆధారాలు న్నాయన్నారు. సర్పంచ్ పదవికి పోటీ చేస్తే తాము మద్దతిస్తామని ఏ1 నిందితుడికి పిన్నెల్లి సోదరులు హామీ ఇచ్చారన్నారు. వాస్తవాలను వెలికి తీయాలంటే వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృ ష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలను కస్టడీలోకి తీసుకొని విచారించాల్సి ఉందన్నారు. బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్నారు.

పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది
ముందస్తు బెయిలు పిటిషన్లను కొట్టేయాలని కోరారు. ఫిర్యాదు దారుడు తోట ఆంజనేయులు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంను పగలగొట్టిన చరిత్ర పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గండ్లపాడు గ్రామంలో 2022లో చోటు చేసుకున్న ఓహత్య కేసులో పిటిషనర్ల పాత్ర ఉందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎఫ్ఎఆర్ లతో పేర్లు లేకుండా చేసుకున్నారన్నారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి సార్వత్రిక ఎన్నికల తర్వాత పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేయండి అని కోరారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులో పిటీషనర్లలను ఇరికించారని 5 పిటీషనర్ల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషనన్ను హైకోర్టు కొట్టివేసింది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :