యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న జిగ్రీస్ (Jigris ) సినిమా ఇప్పుడు మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా విడుదలైన టీజర్ కేవలం మూడు రోజుల్లోనే రెండు మిలియన్ల వ్యూస్‌ను దాటింది. దీనితో సినిమాపై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా యువతలో మంచి ఆసక్తి పెరిగింది. టీజర్‌లోని కంటెంట్, ప్రెజెంటేషన్ యూత్ మైండ్‌సెట్‌ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ స్పందనతో సినిమా యూనిట్ ప్రమోషన్లను మరింత వేగవంతం చేస్తోంది.
ఇక తాజాగా విడుదలైన మొదటి పాట “తిరిగే భూమి” కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ పాటను లాంచ్ చేసి, పాటలోని ఎనర్జీ, కమ్రాన్ సయ్యద్ ఇచ్చిన ఫ్రెష్ ట్యూన్, పాజిటివ్ లిరిక్స్ గురించి ప్రత్యేకంగా ప్రశంసలు అందించారు. జిగ్రీస్ టీమ్ ఎంతో ప్యాషన్‌తో పనిచేస్తున్నందున సినిమా విజయవంతం అవుతుందని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. షూటింగ్ బిజీ షెడ్యూల్ మధ్య సమయం కేటాయించి ఈ కార్యక్రమానికి హాజరై టీమ్‌కు సపోర్ట్ ఇవ్వడం ద్వారా కూడా ఆయన అభిమానులను ఆకట్టుకున్నారు.
ఈ చిత్రంలో కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ వంటి యువ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వంలో, కృష్ణ వోడపల్లి నిర్మాణంలో మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. కమ్రాన్ సయ్యద్ సంగీతం, ఈశ్వర్ ఆదిత్య ఛాయాగ్రహణం, చాణక్య రెడ్డి తూర్పు ఎడిటింగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. T-Series ద్వారా విడుదలైన టీజర్, పాటలు ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేస్తుండగా, Big Fish Media డిజిటల్ ప్రమోషన్లు సినిమాకు మరింత బజ్ తీసుకొస్తున్నాయి. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకి యువతలో భారీ ఎక్సపెక్టేషన్స్ నెలకొన్నాయి.