हिन्दी | Epaper
10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

Today News : Kanipakam temple – కాణిపాకంలో వైభవంగా ధ్వజారోహణం

Shravan
Today News : Kanipakam temple – కాణిపాకంలో వైభవంగా ధ్వజారోహణం

Kanipakam temple : కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామివారి దేవస్థానంలో జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో (Brahmotsavams) భాగంగా గురువారం ధ్వజారోహణం కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఆలయ ఆలయంలో 21 రోజులుపాటు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా తొమ్మిది రోజులు పాటు జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ధ్వజారోహణం, అంకురార్పణ జరిగింది. ఈమేరకు ఉదయం స్వాతినక్షత్రం, శుభ తులాలగ్నం నందు ఉదయం 9.30 గంటల నుండి 10.10 గంటల మధ్య ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాదిదేవతలను ఆహ్వానించేందుకు ధ్వజారోహణం చేయడం ఆనవాయితీ. దుష్ట శకునాలు తగలకుండా బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి అంకురార్పణ చేస్తారు. ఉదయం ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి అర్చకస్వాములు ముందుగా స్వామివారి మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం ప్రధాన ఆలయంలలోని నూతన బంగారు ధ్వజస్థంభం వద్ద విఘ్నేశ్వరపూజ, అనుజ, స్థలశుద్ది, పుణ్యాహవాచనం, వాస్తుశాంతి, నవసంధిబలి, కలశపూజ, మూషికయాగం, ధ్వజపటపూజ, న్యాయాభిషేకం, భావనాభిషేకం నిర్వహించారు.

Today News : Kanipakam temple - కాణిపాకంలో వైభవంగా ధ్వజారోహణం
Kanipakam temple – కాణిపాకంలో వైభవంగా ధ్వజారోహణం
శాస్త్రోక్తంగా అంకురార్పణ, పంచామృతాభిషేకంతో బ్రహ్మోత్సవాల శుభారంభం

అనంతరం బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరగడానికి, ఉత్సవాలకు బ్రహ్మాది దేవతలను ఆహ్వానిస్తూ బంగారు ధ్వజస్థంభంపై మూషికపటాన్ని ఎగురవేశారు. అనంతరం బంగారు ధ్వజస్థంభానికి పాలు, పెరుగు వంటి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం వేదపండితులు చతుర్వేద పారాయణం చేసి మరోమారు ధూపదీపనైవేద్యాలను సమర్పించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈమేరకు ఆర్చకులు గ్రామ సమీపంలో పుట్ట మన్ను సేకరించి మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు. ఈసందర్భంగా అర్చక స్వాములు అష్టోత్తర కలశాలను (108) ఏర్పాటు చేసి పూజలు చేసి కలశస్థాపన, అగ్ని ప్రతిష్టహోమం నిర్వహించారు. ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రధాన ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో అంకురార్పణ గావించారు. ఈ యాగశాలలో నవరాత్రి దీక్షాహోమాన్ని శాస్త్రోక్తంగా అనంతరం బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించడానికి కంకణబద్దులై ఆలయ ఈఓ పెంచల కిషోర్, అర్చకులు ఆచార్య రక్షాబంధనాన్ని ధరించారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/vedapathashala-vedapathashala-to-be-opened-soon-in-kanipakam/andhra-pradesh/537681/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870