Rain: గత 20రోజులుగా తెలంగాణ(Telangana) అంతటా ఎడతెరపీ లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు నీటమునిగిపోయాయి. జూన్ మాసమంతా వర్షాల కోసం ఎదురు చూసిన రైతులు జులై నుంచి కాస్త వర్షాలు కురుస్తుండడంతో వారి ఆనందానికి అవధులేవు. అయితే ఆ వర్షాలు కాస్త భారీవర్షాలుగా మారుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ అల్పపీడనం వాయుగుండంగా మారి విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, గుంటలు నీటితో మునిగిపోయాయి. ఇక అధిక వర్షాలతో పలు గ్రామాలు నీటిలో మునిగిపోయాయి.
వరదబాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దీంతో వరద సహాయక చర్యలు, విపత్తు నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు(High Court) ఆదేశించింది. సెప్టెంబరు 17వ తేదీలోపు పూర్తి నివేదిక అందజేయాలని హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు ఏం ఆదేశించింది?
వరద సహాయక చర్యలు మరియు విపత్తు నిర్వహణపై ప్రభుత్వం తీసుకున్న చర్యల నివేదికను సెప్టెంబర్ 17 లోపు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
ప్రభుత్వం పై ఏ విమర్శలు వచ్చాయి?
ప్రజలకు తక్షణ సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వ్యక్తమయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: