Latest News : 75 ఏళ్ల వయసు వచ్చాక పదవీ విరమణ చేయాలనే నిబంధనపై ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ క్లారిటీ ఇచ్చారు. ప్రధాని మోడీకి వచ్చే నెల 75వ పుట్టినరోజు ఉండటంతో, ఆయన రిటైర్ అవుతారన్న ఊహాగానాలు బలంగా వినిపించాయి. Latest News అయితే, ఆరెస్సెస్ తరఫున అలాంటి రూల్ ఎప్పుడూ లేదని భగవత్ స్పష్టం చేశారు.
భగవత్ మాట్లాడుతూ – “నేను రిటైర్మెంట్ వయసు గురించి ఎప్పుడూ చెప్పలేదు. ఎవరికైనా 75 ఏళ్లు నిండిందని పదవి నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదు. సంఘ్ చెప్పిన మార్గంలోనే మేము నడుస్తాం” అని తెలిపారు.
ఈ వ్యాఖ్యలతో మోడీ పదవి నుంచి తప్పుకుంటారనే రాజకీయ వర్గాల ప్రచారానికి తెరపడినట్లయింది. లేదంటే ఇప్పటికే ప్రధాని మోడీతో పాటు కొన్ని కీలక మంత్రులు కూడా 75 ఏళ్ల నిబంధనకు లోబడతారని ప్రచారం జరిగింది.
వాస్తవానికి మోడీ తర్వాత ప్రధానమంత్రి పదవిలో అమిత్ షా లేదా యోగి ఆదిత్యనాథ్ వస్తారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ భగవత్ స్పష్టతతో ఆ వాదనలకు చెక్ పడింది. దీంతో మోడీకి భారీ ఊరట లభించినట్లైంది.
Read also :