Gond Laddu-కావలసిన పదార్థాలు:
- గోంద్ బంక – అర కప్పు (సూపర్ మార్కెట్లలో లభిస్తుంది)
- గోధుమపిండి – అర కప్పు
- బెల్లం – అర కప్పు
- పాలు – రెండు టేబుల్ స్పూన్లు
- నెయ్యి – పావు కప్పు
- ఉప్పు – చిటికెడు
- ఎండు కొబ్బరి తురుము – పావు కప్పు
- తరిగిన బాదం, కాజు – పావు కప్పు
- కిస్మిస్ – ఐదు
- గుమ్మడి గింజలు – ఒక టేబుల్ స్పూన్
- యాలకుల పొడి – అర టీస్పూన్
తయారు చేసే విధానం:
ఒక గిన్నెలో గోధుమపిండి, టీస్పూన్ నెయ్యి(ghee),చిటికెడు ఉప్పు, పాలు వేసి బాగా కలిపి పావుగంట పాటు పక్కన పెట్టాలి. ఈ మిశ్రమాన్ని పొడిపొడిగా మెదిపి, రవ్వ జల్లెడతో జల్లించుకోవాలి. పాన్లో నెయ్యి వేడయ్యాక గోంద్ బంకను వేయించి పక్కన పెట్టాలి. అదే పాన్లో కాజు, బాదం తురుము, గుమ్మడి గింజలు, కిస్మిస్, ఎండు కొబ్బరి(Dry coconut) తురుము వేసి వేయించాలి. ఇవన్నీ వేగాక సిద్ధం చేసిన గోధుమపిండి మిశ్రమం వేసి మరో రెండు నిమిషాలు వేయించి దించాలి. పాన్లో బెల్లాన్ని లేతపాకంగా పట్టుకోవాలి. ఆ బెల్లం పాకంలో గోంద్ బంక, యాలకుల పొడి వేసి అన్నిటినీ గోధుమపిండిలో బాగా కలపాలి. చివరగా ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డూలుగా చుట్టుకుంటే రుచికరమైన, నోరూరించే గోంద్ లడ్డు రెడీ.

Read also: hindi.vaartha.com
Read also: