News Telugu: సిద్ధిపేట జిల్లా పోతారెడ్డిపేట (Pothareddypet)లో నిన్న పొలం పనులకు వెళ్లి వాగులో ముగ్గురు రైతులు చిక్కుకుపోయారు. దీంతో రాత్రంతా వాగు వద్ద బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు స్థానికులు రాత్రి ఆహారం పొట్లాల్లో కట్టి విసిరారు. తమను రక్షించాలంటూ రైతులు కోరుతున్నారు.
వాగులో నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ప్రాణభయంతో సాయం కోసం నిరీక్షిస్తున్నారు. అధికారులు తక్షణం స్పందించి, తమవారి ప్రాణాలను కాపాడలని రైతుల బంధువులు కోరుతున్నారు. మరోవైపు సిద్ధిపేటలో భారీ వర్షాలకు కాలనీలు జలమయమయ్యాయి. చెరువులు, కాలువలు నీటితో పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. ఇళ్లలో నీళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. మరో రెండురోజులు వర్షాలు (Rain for two days) తప్పవని అధికారులు అంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: