క్రికెట్‌లో ఫిట్‌నెస్ ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారింది. ఆటగాళ్ల శారీరక సామర్థ్యాన్ని, మానసిక ధైర్యాన్ని, సహనాన్ని అంచనా వేయడానికి పలు రకాల ఫిట్‌నెస్ పరీక్షలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అలాంటి వాటిలో ఒకటి బ్రోంకో టెస్ట్. తాజాగా ఈ పరీక్ష గురించి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, మిస్టర్ 360గా పేరొందిన ఏబీ డివిలియర్స్ (AB de Villiers) తన అనుభవాన్ని పంచుకున్నారు.
బ్రోంకో టెస్ట్ అంటే ఏమిటి?
బ్రోంకో టెస్ట్ (Bronco Test) ను దక్షిణాఫ్రికాలో “స్ప్రింట్ రిపీట్ ఏబిలిటీ టెస్ట్” అని కూడా పిలుస్తారు. ఈ పరీక్షలో క్రీడాకారులు 20 మీటర్లు, 40 మీటర్లు, 60 మీటర్లు ఇలా దూరాలను వరుసగా పరిగెత్తుతూ, ఆ ప్రక్రియను ఐదు రౌండ్లు పూర్తి చేయాలి. మొత్తం మీద 1,200 మీటర్ల పరుగును వేగంగా పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని పరీక్షించడం దీని లక్ష్యం. దీని ద్వారా ఆటగాడి ఏరోబిక్ ఫిట్‌నెస్, ఊపిరితిత్తుల సామర్థ్యం, రిపీట్ స్ప్రింట్ స్కిల్స్ అన్నీ అంచనా వేయబడతాయి.

ఏబీ డివిలియర్స్ అనుభవం
ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. తాను 16 ఏళ్ల వయస్సు నుంచే ఈ పరీక్షను ఎదుర్కొంటున్నాని.. దక్షిణాఫ్రికాలో దీనిని “స్ప్రింట్ రిపీట్ ఏబిలిటీ టెస్ట్” అని పిలుస్తారని ఆయన వెల్లడించారు. ఈ పరీక్ష ఏరోబిక్ ఓర్పు, కోలుకునే సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. ఈ పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో వివరిస్తూ..’ఇది మీరు చేయగలిగిన పరీక్షల్లో అత్యంత చెత్తది’ అని ఆయన అన్నారు. ముఖ్యంగా ఎక్కువ ఎత్తులో, ఆక్సిజన్ తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇది మరింత కష్టమని వివరించారు. ఉదాహరణకు ప్రిటోరియా యూనివర్సిటీ (University of Pretoria) లో, సూపర్ స్పోర్ట్ పార్కులో చలికాలంలో ఈ పరీక్ష చేసినప్పుడు ఊపిరితిత్తులు మండేవని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 1,500 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల ఆక్సిజన్ తక్కువగా ఉంటుందని, అందుకే ఈ పరీక్ష చాలా కష్టంగా ఉంటుందని ఆయన చెప్పారు.
ఫిట్‌నెస్ అంచనా
టీమిండియా కొత్త స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అయిన అడ్రియన్ లే రూక్స్ ఈ బ్రోంకో పరీక్షను, యో-యో టెస్ట్, 2 కిలోమీటర్ల టైమ్ ట్రయల్‌తో పాటు ఫిట్‌నెస్ అంచనాలో చేర్చాలని భావిస్తున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై మాజీ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక హెచ్చరిక చేశారు. శిక్షకులు మారినప్పుడు, పరీక్షా విధానాలు మారడం వల్ల ఆటగాళ్లు ఇబ్బందులకు గురవుతారని, కొన్నిసార్లు గాయాలు కూడా కావచ్చని ఆయన తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పారు. ఫిట్‌నెస్ వ్యవస్థలో స్థిరత్వం ఉండాలని అశ్విన్ సూచించారు.
ఆయనను అభిమానులు ఏ పేరుతో పిలుస్తారు?
అభిమానులు ఏబీ డివిలియర్స్‌ను “మిస్టర్ 360” అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన మైదానంలోని అన్ని కోణాల్లో అద్భుతమైన షాట్లు ఆడగలడు.
ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎప్పుడు అరంగేట్రం చేశాడు?
2004లో ఇంగ్లాండ్‌పై జరిగిన టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తరఫున తన అరంగేట్రం చేశాడు.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: