భారత రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానం మరోసారి దెబ్బకి దెబ్బ వేసింది. అత్యాధునిక నీలగిరి-క్లాస్ స్టెల్త్ యుద్ధనౌకలు (Class Stealth warships) అయిన ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి నౌకాదళంలోకి ప్రవేశించాయి. మంగళవారం జరిగిన ఈ అద్భుత వేడుకకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఒకేసారి రెండు ప్రధాన నౌకలు ప్రారంభించడమంటే ఎంతో గర్వకారణం. భారతదేశంలోని రెండు ప్రముఖ షిప్‌యార్డ్‌లు – గార్డెన్ రీచ్ (కోల్‌కతా), మజగావ్ డాక్ (ముంబై) ఈ రెండు నౌకలను నిర్మించాయి. ఇలా ఒకే రోజున, వేర్వేరు ప్రాంతాలనుండి రెండు స్టెల్త్ యుద్ధనౌకలు ప్రారంభించడం ఇదే ప్రథమం.ఈ నౌకలు ప్రాజెక్ట్ 17A లో భాగంగా నిర్మించబడ్డాయి. వీటిలో 75 శాతం పైగా స్వదేశీ టెక్నాలజీ ఉపయోగించడం గమనార్హం. ఇది భారత్ స్వయం సమర్థతకు (ఆత్మనిర్భర్ భారత్) నిలువెత్తిన నిదర్శనం. స్వదేశీ టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన నౌకలు తయారవుతుండటం గర్వించదగ్గ విషయం.

నౌకాదళంలో సేవలు – తూర్పు దళం సిద్దం
ఈ రెండు యుద్ధనౌకలు భారత తూర్పు నౌకాదళంలో సేవలు అందించనున్నాయి. హిందూ మహాసముద్రంలో చైనా పెరుగుతున్న ప్రభావం, వారి ‘ముత్యాల హారం’ వ్యూహానికి ఇది సమాధానంగా మారబోతోంది. భారత నౌకాదళానికి ఇది ఓ వ్యూహాత్మక బలంగా మారుతుంది.
ఆధునిక టెక్నాలజీతో కంచుకోటలుగా
ఈ యుద్ధనౌకల ప్రత్యేకతలు పరిశీలిస్తే అద్భుతంగా ఉంటాయి:
బరువు: సుమారు 6,700 టన్నులు.
పొడవు: 149 మీటర్లు.
గరిష్ఠ వేగం: గంటకు 28 నాట్లు (52 కిలోమీటర్లు).
స్టెల్త్ టెక్నాలజీ: శత్రువు రాడార్‌లకు చిక్కకుండా మారే శక్తి.
ఆర్మమెంట్: బ్రహ్మోస్ క్షిపణులు, బరాక్-8, 76 ఎంఎం గన్స్.
సురక్షిత వ్యవస్థలు: మారీచ్ టార్పెడో డిఫెన్స్.
హెలికాప్టర్ల సామర్థ్యం: రెండింటిని ఆపరేట్ చేయగలదు.ఇవి సాధారణ నౌకలు కావు. యుద్ధ సమయంలో శత్రువులను తుంచేసే శక్తితో నిండి ఉన్నాయి.
దేశీయ నిర్మాణ సామర్థ్యం పెరుగుతోంది
ఐఎన్ఎస్ హిమగిరి, ఉదయగిరి లాంఛనంగా ప్రారంభించబడటం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. భారత్‌కి నౌకా నిర్మాణ రంగంలో ఉన్న దార్ఢ్యాన్ని ఈ ప్రారంభోత్సవం చాటిచెప్పింది. దేశీయ టెక్నాలజీ, శాస్త్రీయ నైపుణ్యాలు అంతర్జాతీయ స్థాయిలో ఎంత స్థిరంగా నిలబడ్డాయో ఇది సూచిస్తుంది.ఈ నూతన నౌకలు భారత నౌకాదళ భవిష్యత్తుకి మార్గనిర్దేశకాలు. మరింత బలమైన, ఆధునిక యుద్ధ నౌకలతో సముద్ర జలాల్లో భారతదేశం తన ఆధిపత్యాన్ని మరోసారి స్పష్టంగా చాటుతోంది.
Read Also :