Kudumulu:కావాల్సిన పదార్థాలు:
బియ్యపునూక – ఒక గ్లాసు
సెనగపప్పు – సుమారు 4,5 స్పూన్లు
నెయ్యి – 1/4 కప్పు
ఉప్పు – తగినంత

తయారు చేసే విధానం:
ముందుగా సెనగపప్పును అరగంట నీటిలో నానబెట్టుకోవాలి. బియ్యపు నూకను స్టౌ మీద దళసరి గిన్నె పెట్టి రెండున్నర గ్లాసుల నీటిని (water) పోసి బాగా మరిగాక నానిన సెనగపప్పు వేయాలి. రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చి మెల్లగా కలుపుతూ బియ్యపు నూకను వేయాలి. కొంచెం దగ్గరికి అయిన తరువాత నెయ్యి (ghee) వేసి బాగా కలిపి తగినంత ఉప్పు వేసి మరోసారి కలియబెట్టి మూత పెట్టాలి. రెండు మూడు నిమిషాల తరువాత స్టౌ ఆఫ్ చేసి ఉడికిన ముద్దను గిన్నెలోకి తీసి కుక్కర్లో పెట్టుకోవాలి. రెండు మూడు విజిల్స్ రాగానే ఆపేసి బైటికి తీసి చేతికి నెయ్యి రాసుకుని ఉండలుగా చేసుకోవాలి. ఇష్టమైతే జీలకర్ర వేసుకోవచ్చు.

Read also: hindi.vaartha.com
Read also: