News Telugu: వాయువ్య బంగాళాఖాత ప్రాంతం, ఒడిశా – వెస్ట్ బెంగాల్ తీరాలకు సమీపంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి దాదాపు 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
రుతుపవన ద్రోణి ప్రభావం
తూర్పు – ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం (Northeast Bay of Bengal) వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. ఈ పరిస్థితులు వర్షపాతం పెరగడానికి దోహదం చేయనున్నాయి.

తెలంగాణలో వర్షాల అంచనా
వాతావరణ కేంద్రం ప్రకటన ప్రకారం, ఈరోజు తెలంగాణ (Telangana) లోని వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులు, గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురు గాలులతో కూడి ఉండనున్నాయి.
రేపటి వాతావరణ పరిస్థితులు – తెలంగాణ
రేపు కూడా ఇలాగే తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా, బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30–40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
శ్రీకాకుళంలో భారీ వర్షం ప్రభావం
ఇక శ్రీకాకుళం జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీని ఫలితంగా డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, రైతు బజార్, అలాగే పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా ఇలిసిపురం జంక్షన్, ఫారెస్ట్ ఆఫీస్, బొందిలిపురం రోడ్లలో మోకాళ్ళ-లెవెల్ లోతులో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: