Khairatabad Ganesh 2025 : గణేశ్ చతుర్థి 2025 కు ఇంకో మూడు రోజులు మాత్రమే ఉండగా, తెలంగాణాలోనే అతిపెద్ద ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ గణపతి పై అందరి చూపులు ఉన్నాయి.
ఈసారి ప్రతిష్టించబడుతున్న విశ్వశాంతి మహాశక్తి గణపతి ఇప్పటికే భక్తుల (Khairatabad Ganesh 2025) దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్య శిల్పి చిన్న స్వామి రాజేంద్రన్ పర్యవేక్షణలో రంగుల పనులు వేగంగా జరుగుతున్నాయి. భక్తులు, సందర్శకులు ముందుగానే గణపతి వద్దకు చేరి ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ పండుగ వాతావరణాన్ని కల్పిస్తున్నారు.
ఆధ్యాత్మిక మహిమ – దివ్య రూపాలు
2025 మహా గణపతి విగ్రహం శాంతమూర్తి రూపంలో దర్శనమిస్తోంది.
ప్రపంచ సమతుల్యతకు ప్రతీకలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గణపతి చుట్టూ ఉంటారు.
ఎడమవైపు జగన్నాథుడు, సుభద్ర, బాలరాం దర్శనమిస్తారు. కుడివైపు లక్ష్మీదేవి, హయగ్రీవ స్వామి ఉంటారు.
మండపంలో కన్యాకా పార్వేశ్వరి (కుడివైపు), గజ్జెలమ్మ (ఎడమవైపు) ప్రతిష్టించారు.
2025 ఖైరతాబాద్ గణేశ్ ముఖ్యాంశాలు
- విగ్రహం పేరు: విశ్వశాంతి మహాశక్తి గణపతి
- ఎత్తు: 69 అడుగులు
- వెడల్పు: 28 అడుగులు
- నిర్మాణ కాలం: 84 రోజులు
- కార్మికులు: 125 మంది కళాకారులు
- వాడిన సామగ్రి:
- ఇనుము: 30 టన్నులు
- మట్టి (గుజరాత్ నుండి): 1,000 సంచులు (ప్రతి సంచి 30 కిలోలు)
- బియ్యం తొక్క: 70 సంచులు (ప్రతి సంచి 25 కిలోలు)
- ధాన్యం, రంగులు, ఇతర పదార్థాలు: 50 ఎద్దుల బండ్లు (ప్రతి బండి 20 కిలోలు)
- విసర్జన తేదీ: మహా గణపతి నిమజ్జనం సెప్టెంబర్ 6, 2025