Nagar Kurnool: ఇటీవల మన సమాజంలో చిన్నచిన్న కారణాలకే చంపడం, ఆత్మహత్య చేసుకోవడం పరిపాటిగా మారింది. గ్యాడ్జెట్లు చేతిలో వచ్చాక అనుబంధాల కంటే వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తద్వారా కుటుంబ బంధాలు విచ్చిన్నమైపోతున్నాయి. కంప్యూటర్, ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్లు, ఐపాడ్, టీవీ ఏవైతేనేం వాటిని మన అవసరం, ఆనందం కోసం ఏర్పాటు చేసుకున్న సాధనాలే. అవి మన ఆధీనంలో ఉండాలే తప్ప వాటి అదుపులో మనం ఉంటే చివరికి కన్నీరే మిగిలిపోతుంది. కుటుంబాలు నాశనమైపోతాయి. ఇలాంటి ఓ కుటుంబ పాడై పోయేందుకు కారణం ఓ స్మార్ట్ఫోన్. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలంకి ఓసారి రాంగ్ నెంబర్ ద్వారా మహబూబ్ నగర్(Mahabubnagar) జిల్లా దేవరకద్ర మండలం గోటూరుకు చెందిన శ్రావణ (27)కు పరిచయం ఏర్పడింది. ఇలా వీరిద్దరిమధ్య ఏర్పడిన ఫోన్ సంభాషణలు చివరికి ప్రేమ వరకు నడిపించింది. దీంతో 2014లో వీరిద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు, పాప కూడా ఉన్నారు.
భార్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుందనే అనుమానం
పెళ్లయిన కొంతకాలానికి శ్రావణి భర్త, పిల్లలను వదిలేసి, తన అక్క భర్తతో వెళ్లిపోయింది. ఏడాది క్రితం మళ్లీ ఆమె భర్త వద్దకు రాగా భర్త శ్రీశైలం తిరిగి ఆమెను భార్యగా అంతీకరించాడు. అయితే శ్రావణ ఎవరితోనో ఫోన్లో మాట్లాడటం, చాటింగ్ చేయడం గమనించిన శ్రీశైలం భార్యతో గొడవపడేవాడు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు ఆమెను నవాచ్చరించాడు. అయినా శ్రావణి తన ప్రవర్తనను మార్చుకోలేదు. దీంతో విసుగు చెందిన భర్త శ్రీశైలం ఆమెను చంపాలని పథకం వేసాడు.
సోమశిల చూద్దామని నమ్మించి..
కాగా శ్రీశైలం(Srisailam) తన భార్య శ్రావణిని సోమశిలను చూద్దామని చెప్పి భార్యను బైక్పై తీసుకెళ్లాడు. అయితే పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ సమీపంలో సీతాఫలం పండ్లు ఉంటాయని చెప్పి అడవిలోకి తీసుకెళ్లాడు. తొలుత చున్నీని ఆమె మెడకు చుట్టి, గొంతునులిమాడు. అంతటితో ఆగక తన వవెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు పొడిచి చంపి, వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి తగులబెట్టి, అక్కడి నుంచి పరారయ్యడు. అయితే తమ కూతురు కనిపించట్లేదని శ్రావణి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు భర్త శ్రీశైలం నేరుగా వచ్చి, పోలీసులకు లొంగిపోయాడు. క్షణికమైన సుఖాల కోసం, కుటుంబ బంధాల కంటే ఫోన్లకే అధిక ప్రాధాన్యత ఇస్తే పరిణామాలే జరుగుతాయనేందుకు ఈ సంఘటన అద్దం పడుతుంది.
హత్య ఎలా జరిగింది?
శ్రీశైలం భార్యను సోమశిల చూద్దామని నమ్మించి బైకుపై తీసుకెళ్లాడు. తర్వాత అడవిలోకి తీసుకెళ్లి, చున్నీతో గొంతునులిచి, కత్తితో పొడిచి చంపి, పెట్రోల్ పోసి తగలబెట్టాడు.
ఈ ఘటన ద్వారా ఏ సందేశం తెలుస్తుంది?
కుటుంబ బంధాల కంటే ఫోన్లకు, అనుమానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే చివరికి దుస్థితులు మాత్రమే జరుగుతాయని ఈ సంఘటన చెబుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: