ఇంద్రకీలాద్రి Kanaka Durga : శ్రీ దుర్గామలేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాల (Varalakshmi Vratala) సందర్భంగా రెండు బ్యాచ్‌లుగా నిర్వహించబడిన ఈ వ్రతాలు ఉదయం 7 గంటల నుండి 9 వరకు రు. 1500 రుసుముతో ఆర్జిత సేవగాను, ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు ఉచితంగాను ఘనంగా నిర్వహించామని, ఈ రెండు బ్యాచ్‌ల వ్రతాల్లో పాల్గొన్న వారికి కుంకుమ, జాకెట్ ముక్క, శ్రీ అమ్మవారి ప్రసాదం, శక్తి కంకణం అందించామని ఈవో వికె శీనా నాయక్ తెలిపారు. వ్రతానంతరం మహిళ భక్తులకు అమ్మవారి దర్శనం ఏర్పాటు చేశారు. దుర్గమ్మవారి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం ఏలూరు న్యూ అశోకనగర్కు చెందిన పి శ్రీరామ్ సీతారామయ్య (P Sriram Seetharamaiah) ప్రియాంక దంపతులు త్రిలోక్య ఆర్య పేరు మీద రు.1,00,000/-ల విరాళాన్ని నిడమానూరు రామాలయం వీధికి చెందిన శివరామకృష్ణ ప్రసాద్ రూ.1,00,005/-లు దంపతులు దాతలకు అందించారు. దుర్గమ్మవారి దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం, అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, మెమొంటోలు అందించారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :