Crime News: ప్రేమి ఎంతో పవిత్రమైనది. రెండు మనసుల కలయిక ఇందులో శారీరక కలయిక కోసం పరితపించదు. ప్రేమ ఎప్పుడూ ఎదుటివారి క్షేమాన్నే కోరుతుంది. అందుకోసం ఎంతటి త్యాగానికికైనా వెనుకాడదు. ప్రేమ ఉప్పొంగదు. అది అమర్యాదగా ప్రవర్తించదు. ఎదుటివారికి కీడును తలపెట్టడు. అన్నింటిని భరించే శక్తి కేవలం ప్రేమకు మాత్రమే ఉంది. అలాంటి ప్రేమలు నేటికాలంలో మసకబారిపోతున్నాయి. ప్రేమ అంటే నాలుగురోజులు కలిసి తిరగడం, సుఖాలను అనుభవించడం ఆ తర్వాత చావడమో చంపడమో జరుగుతున్నాయి. లేత వయసులో ఆకర్షణే ప్రేమగా భ్రమించి, దానికోసం జీవితాలను పాడుచేసుకుంటున్న వారు ఎందరో. ఇలాంటి వారిలో వర్షిత ఒకరు.

ఇన్స్టాగ్రామ్ పరిచయం..ఆపై ప్రేమ
కర్ణాటక రాష్ట్రంలోని(karnataka State) చిత్రందుర్గకు చెందిన డిగ్రీ విద్యార్థిని వర్షిత (19)కు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన చేతన్(21) పరిచయం అయ్యాడు. నెట్ వర్కింగ్సం స్థలో పనిచేస్తూ, కొత్తవారిని చేర్చడానికి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన చేతన్. ఆ పోస్ట్ను చూసిన వర్షిత ఉద్యోగం కోసం చేతన్కు కాల్ చేసింది ఆమె. ఇంకేమీ ఉంది ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అది ఎందాక తీసుకెళ్లింది అంటే ఆమె గర్భం దాల్చేంతగా హద్దులు దాటింది. ఇంకేమీ ఉంది తనను పెళ్లి చేసుకోవాలని వర్షిత చేతన్ పై ఒత్తిడి తెచ్చింది. ఆమెతో పాటు వర్షిత పినతల్లి కూడా వర్షితను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరింది.
పెళ్లి ఇష్టం లేక హత్యకు ప్లాన్
చేతను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆమె వేరేవారితో వర్షిత సన్నిహితంగా ఉందనే అనుమానాన్ని పెంచుకున్నాడు చేతన్. దీంతో ఈనెల 18న వరి తను నమ్మించి, చిత్రదుర్గ బైపాస్ రోడ్డులో(bypass road) ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు. ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టిన చేతన్ ఏమీ ఎరుగనట్లుగా వెనుతిరిగి వచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిస్థానికులు
కాగా వర్షం పడడంతో మృతదేహం సగం కాలిపోయింది ఉంది. దీన్ని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా మృతదేహం వర్షితదిగా గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. చేతన్ ఆమెను హత్య చేసినట్లుగా నిర్ధారించారు. చేతన్ ను అదుపులోకి తీసుకున్నారా లేదా అనే వివరాలు ఇంకా తెలియదు.
వర్షిత, చేతన్ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది?
ఇద్దరి పరిచయం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏర్పడింది. మొదట ఉద్యోగం విషయమై సంప్రదింపులు జరగగా, అది క్రమంగా ప్రేమ సంబంధంగా మారింది.
హత్యకు కారణం ఏమిటి?
చేతన్‌కు వర్షితతో పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి లేకపోవడంతో పాటు, ఆమె వేరేవారితో సన్నిహితంగా ఉందనే అనుమానం కారణంగా ఈ హత్య జరిగిందని అనుమానిస్తున్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :