భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తల్లి కోకిలాబెన్ అంబానీ(Kokilaben Ambani) ఆసుపత్రిలో చేరారు. కోకిలాబెన్ ఆరోగ్యం గురించి దేశవ్యాప్తంగా అభిమానులు, వ్యాపార వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. కోకిలాబెన్ అంబానీ వయస్సు 90 ఏళ్లకు పైగా ఉంది. వయస్సు కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు రావడంతో, వైద్యుల సలహా మేరకు ఆమెను ముంబైలోని రిలయన్స్ ఆసుపత్రి(Reliance Hospital)లో చేర్చారు. వైద్యులు ఆమె పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రత్యేక చికిత్స అందిస్తున్నారని కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని చెబుతున్నారు.

కుటుంబాన్ని ఒక్క చోట చేర్చిన కోకిలాబెన్
కోకిలాబెన్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మరియు రిలయన్స్ ఏడీఏ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీల తల్లి. 2002లో రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ మరణం తరువాత, కుటుంబాన్ని ఒక్క చోట చేర్చిన వ్యక్తి ఆమె. అందుకే, కోకిలాబెన్ ఆరోగ్యం విషయంలో ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ కుటుంబాలు ఎంతో శ్రద్ధ చూపుతున్నాయి. ఆమె ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిన వెంటనే, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరచూ వస్తూ వెళ్తున్నారని సమాచారం. కోకిలాబెన్ 1934లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జన్మించారు. 1955లో ఆమె ధీరూభాయ్ అంబానీని వివాహం చేసుకుని, కుటుంబ జీవితాన్ని ప్రారంభించారు. వారికి నలుగురు సంతానం ముకేశ్, అనిల్, నినా కోఠారి, దీప్తి సల్గావ్కర్. ఆ కాలంలో మహిళలకు చదువు అంతంత మాత్రమే ఉన్నప్పటికి కోకిలాబెన్ 10వ తరగతి వరకు చదివారు. ధీరూభాయ్ ప్రోత్సాహంతో ఇంగ్లీష్ నేర్చుకుని, ఉన్నత వర్గాల వ్యక్తులతో, విదేశీ అతిథులతో సులభంగా సంభాషించగలిగే స్థాయికి చేరుకున్నారు.
పెద్ద కుమారుడు ముకేశ్ అంబానీతో ఉంటున్న కోకిలాబెన్
కోకిలాబెన్ అంబానీ జీవనశైలి చాలా సాదాసీదాగా ఉంటారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని అంటిలియాలో పెద్ద కుమారుడు ముకేశ్ అంబానీతో కలిసి ఉంటున్నారు. ఆమె పేరు మీద ముంబైలో ఉన్న కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ ఆమె ఆరోగ్యరంగానికి చేసిన కృషికి నిదర్శనం. ఇప్పటికీ కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలకు ఆమె అభిప్రాయమే ప్రాధాన్యం ఉంటుంది. అలాగే, తన కోడళ్ళు నీతా అంబానీ, టినా అంబానీలతో కూడా మంచి స్నేహపూర్వక బంధాన్ని కొనసాగిస్తున్నారు. కోకిలాబెన్ అంబానీకి సంపద పరంగా కూడా ఆవిడ అగ్రగామిగా నిలుస్తారు. ఆమె నికర సంపద సుమారు రూ. 18,000 కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కోకిలాబెన్ పేరు మీదే 1.57 కోట్ల షేర్లు ఉన్నాయి. ఇవి కంపెనీ మొత్తం షేర్లలో సుమారు 0.24% వాటా. ఈ షేర్ల వలన ఆమె రిలయన్స్ కుటుంబంలో అత్యధిక వ్యక్తిగత షేర్ ఉన్న వ్యక్తి.
కోకిలాబెన్ అంబానీ విద్య ఏమిటి?
ముఖేష్ అంబానీ తల్లిదండ్రులు ధీరూభాయ్ అంబానీ మరియు కోకిలాబెన్ ప్రేమ…
కోకిలాబెన్ అంబానీ జామ్‌నగర్‌లోని సజుబా గర్ల్స్ హై స్కూల్‌లో తన పాఠశాల విద్యను 10వ తరగతి వరకు పూర్తి చేసింది.
రిలయన్స్ CEO ఎవరు?
రిలయన్స్ ఛైర్మన్‌గా ముకేశ్ అంబానీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ...
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ. ఆయన అత్యున్నత నాయకత్వ పదవిని కలిగి ఉన్నారు మరియు ఇంధనం, రిటైల్, డిజిటల్ సేవలు మరియు మరిన్నింటిలో కంపెనీ యొక్క విస్తృతమైన వ్యాపారాల పోర్ట్‌ఫోలియోను పర్యవేక్షిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: