Sushmitha: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా ఆయన పెద్ద కుమార్తె, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మరియు నిర్మాత సుస్మిత కొణిదెల హృదయాన్ని తాకే సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన తండ్రిని తన జీవితంలో అతి పెద్ద హీరోగా అభివర్ణించిన ఆమె పోస్ట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సుస్మిత, వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగానూ ఆయన తనకు ఎంతో ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు. “మా హీరో, మా నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒకప్పుడు మీ గారాల పట్టిగా ఉండిన నేను, ఇప్పుడు నిర్మాతగా మీతో ఈ అద్భుతమైన ప్రయాణాన్ని పంచుకోవడం నిజంగా గర్వంగా ఉంది” అని ఆమె రాశారు.

మీరు నేర్పిన ఆత్మీయపాటలు ఎన్నో…
అలాగే తండ్రి నుంచి ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నానని సుస్మిత హృదయపూర్వకంగా చెప్పుకొచ్చారు. “మీరు ఇచ్చిన ప్రతి పాఠానికి, పంచిన ప్రతి చిరునవ్వుకి, ఇచ్చిన ప్రతి ఆలింగనానికి ధన్యవాదాలు డాడ్. లవ్ యూ ఫరెవర్” అంటూ తండ్రిపై తన అపారమైన ప్రేమను వ్యక్తం చేశారు.ఈ పోస్ట్‌కు మరింత ప్రత్యేకతను చేకూరుస్తూ, చివరగా చిరంజీవి కొత్త సినిమా పేరును సుస్మిత ప్రస్తావించారు. “మన శంకర వరప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ ముగించిన ఆమె సందేశం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిరంజీవి 157వ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’(Our Shankara Varaprasad) కి సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
సుస్మిత తన పోస్ట్‌లో ఏమి ప్రస్తావించారు?
తన తండ్రి నుంచి నేర్చుకున్న పాఠాలు, ఆయన ఇచ్చిన ప్రేమను గుర్తుచేసుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు.
సుస్మిత కొణిదెల ఏ సినిమా ప్రాజెక్ట్‌లో నిర్మాతగా ఉన్నారు?
చిరంజీవి 157వ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: