రాజంపేట Tragedy : ప్రకృతి వనరులను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఇసుకను నదిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి ముగ్గురు విద్యార్థులను బలిగొన్నారు. వివరాల్లోకి వెళితే… ఉమ్మడి కడప జిల్లా రాజంపేట (Rajampet, joint Kadapa district) రాయచోటి రోడ్డులోని బాలరాజ్ పల్లె వద్ద చెయ్యేరు నదిలో గత ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుతం కూడా ఇష్టారాజ్యంగా గుత్తేదారులు ఇసుకను నదిలో లోడేస్తున్నారు. పెద్ద ఎత్తున గోతులు ఏర్పడ్డాయి. రెండు రోజుల క్రితం పించా నది నుంచి 252 క్యూసెక్కుల నీటిని నదిలో విడుదల చేశారు. ప్రవాహం రావడంతో నదిలో పడిన పెద్ద గుంతలు కనిపించలేదు. సరదాగా నీటిలో ఆడుకునేందుకు వెళ్లిన ముగ్గురు ఎంబీఏ విద్యార్థులు ఇసుక తవ్వి వేసిన గుంత లలో ఇరు క్కు పోయారు. ముగ్గురికి ఈత రాకపోవడంతో దుర్మరణం పాలయ్యారు. మృతులంతా స్థానిక అన్నమాచార్య పీజీ కళాశాలలో (PG college) ఎంబీఏ చదువుతున్నారు. మృతుల్లో రాజంపేట మండలం గాలివారిపల్లి చెందిన దిలీప్, ఒంటిమిట్ట మండలం మండపం పల్లెకు చెందిన కొత్తూరు చంద్రశేఖర్ రెడ్డి, కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణానికి చెందిన పీన రోతు కేశవ గుర్తించారు. మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇకనైనా నదిలో ఇష్టారాజ్యంగా పదుల అడుగుల కొద్దీ గోతులు తవ్వకుండా ఇసుక గుత్తేదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :