Temple : ఎర్గమ్మవారి ఆలయంలో (Temple of Ergamma) శుక్రవారం నాడు ఆగస్టు 22న సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తామని ఇఓ వికె శీనా నాయక్ తెలిపారు. ఉదయం 7 గంటల నుండి 9 వరకు రు.1500 రుసుముతో ఆర్జిత సేవగా, ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు ఉచితంగా నిర్వహిస్తామన్నారు. ఆర్జిత సేవగా పాల్గొనటానికి ఒక్కటికెట్పై ఒక్కరికి మాత్రమే అనుమతి వుంటుందన్నారు. వారికి వ్రతం అనంతరం రు.300 క్యూలైన్ దర్శనం, ఉచిత వ్రతంలో పాల్గొన్న వారికి రు.100 క్యూలైన్ ద్వారా దర్శనం వుంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అనుమతి వుంటుందన్నారు. ఈ రెండు బ్యాచ్ల వ్రతాల్లో పాల్గొన్న వారికి కుంకుమ, జాకెట్ ముక్క, శ్రీ అమ్మవారి ప్రసాదం, (Mother’s offering) కంకణం అందిస్తామన్నారు. – దుర్గమ్మవారి నిత్యాన్నదాన పథకానికి విరాళం దుర్గమ్మవారి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి రు.1,00, 116ల విరాళాన్ని గురువారం గుంటూరుకు చెందిన తిరుమల శెట్టి భార్గవతేజ, సాయిచరిత దంపతులు, వారి కుటుంబసభ్యులు అందించారు. దాతలకు దుర్గమ్మవారి దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు, అనంతరం వారికి దుర్గమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, మెమొంటోలు అందిం చారు. వేదపండితులు వేదాశీర్వచనం పలికారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :