విజయవాడ Sports : క్రీడా క్రీడాకారులకు ప్రభుత్వ పరంగా సౌకర్యాలతో పాటు ఆరోగ్య సంరక్షణపై (Healthcare) కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖ ల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గురువారం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం శాప్ కార్యాలయం ఇండియన్ అకాడమీ ఆఫ్ -స్పోర్ట్స్ డెంటిస్ట్రీ (తిళీదీ) ఆధ్వర్యంలో క్రీడా దంత సురక్ష ఛాంపియన్స్ విన్నింగ్ స్మైల్స్ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దంత సంరక్షణ ను కాపాడుకోవల్సిన ఆవశ్యకత ముఖ్యంగా క్రీడాకారులపై ఉందని, అందుకే ప్రభుత్వ పరంగా ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. క్రీడాకారుల సమగ్ర ఆరోగ్యానికి దంత సంరక్షణ కూడా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ముఖ్యంగా క్రీడాకారులకు దంత సంరక్షణ లో మెలుకువలు పాటించాల్సి ఉందన్నారు. రెగ్యులర్ గా డెంటల్ చెకప్‌లు చేయించుకుంటే డెంటల్ సమస్యలను నివారించవచ్చన్నారు.
క్రీడాకారుల కోసం ఓరల్ హెల్త్ అవగాహన వర్క్‌షాప్, శిక్షణా కార్యక్రమాలు
ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువ క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో మరింత మెరుగైన ప్రతిభను కనబరచే వీలుందని మంత్రి తెలిపారు. డా. శ్రీవల్లి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక వర్క్‌షాప్‌లో క్రీడాకారులకు క్రీడల్లో నోటి ఆరోగ్య ప్రాముఖ్యత, విరిగిన పళ్ల అత్యవసర నిర్వహణ, క్రీడలకు ప్రత్యేకంగా ఉండే మోత్గార్డ్స్ వినియోగంపై అవగాహన కల్పించారు. అదనంగా, క్రీడాకారులకు ఓరల్ హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించగా, రాబోయే నెలల్లో బేసిక్ లైఫ్ సపోర్ట్ (Lily) సర్టిఫికేషన్ శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవి నాయుడు, శాప్ వీసీ మరియు ఎండీ గిరీషా, ఇండియన్ డెంటల్ అసోషియేషన్ కోస్టల్ ఆంధ్రా బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ శిల్పా రావు, సెక్రటరీ డాక్టర్ అజయ్ బెనర్జీ, డాక్టర్ సుర్వే, క్రీడాకారులు, కోచ్ లు పాల్గొన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :