రెండు బంగారు పతకాలు సాధించినవిద్యార్థులు
హైదరాబాద్ : నారాయణ విద్యాసంస్థ ఓ చరిత్రాత్మక విజయాన్ని ఆవిష్కరించింది. నారాయణ విద్యాసంస్థ (Narayana Educational Institute) లకు చెందిన ఇద్దరు విద్యార్థులు బణిబ్రత మాజీ, అక్షత్ శ్రీవాస్తవ, ముంబైలో ఆగస్టు 11 నుంచి 21 వరకు జరిగిన ప్రతిష్టాత్మకమైన 18వ ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ అండ్ అస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్ (ఐఓఏఏ) – 2025లో బంగారు పతకాలు సాధించారు. ఈసారి ప్రపంచదేశాలతో పోటీ పడి ఐఓఏఏ- 2025 నిర్వహణకు భారత్ వేదిక అయ్యింది. భారత్ తరఫున గ్లోబల్ వేదికపై పోటీ పడ్డ బణిబ్రత, అక్షత్ 300 మంది ప్రపంచంలోని ప్రతిభావంతులైన విద్యార్థుల మధ్య పోటీపడి ఈ స్వర్ణ విజయాన్ని అందుకున్నారు. భారత్ తరఫున మొత్తం 4 బంగారు పతకాలు, ఒక రజత పతకం సాధించగా అందులో 2 బంగారు పతకాలు నారాయణ విద్యార్థులే సాధించటం విశేషం.
మరోసారి తన అసాధారణమైన ప్రతిభను ప్రపంచ వేదికపై
ఐవోఏఏ ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన అకడమిక్ పోటీల్లో ఒకటి. ఇందులో పోటీదారులను ఆధునిక సిద్ధాంత జ్ఞానం, డేటా విశ్లేషణ, పరిశీలనా నైపుణ్యాలపై పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో బణిబ్రత అక్షత్ శ్రీవాస్తవ (Banibrata Akshat Srivastava) సాధించిన విజయాలు అసాధారణమైన ప్రతిభ, కృషి, పట్టుదలకి నిదర్శనం. ముఖ్యంగా జేఈఈ మెయిన్-2025లో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన బణిబ్రత, మరోసారి తన అసాధారణమైన ప్రతిభను ప్రపంచ వేదికపై చూపి అబ్బురపరిచాడు. వీరి విజయాలు వ్యక్తిగత కృషికి తోడు, నారాయణలో లభించే బలమైన అకడమిక్ మద్దతు, వ్యక్తిగత శ్రద్ధకు అద్దంపడుతున్నాయి. నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ పి. సింధూర నారా యణ మాట్లాడుతూ “బణిబ్రత, అక్షత్ల ప్రతిభపై మాకు అపారమైన నమ్మకం ఉంది. అంతే కాదు వారు ఎలాంటి వేదికపై అయినా అలవోకగా విజయం సాధించగలరు అనే విశ్వాసం మాకు ఏర్పడింది.

అవకాశాలు అందిస్తూ
ఐవోఏఏ- 2025లో వీరి విజయం కేవలం ఒక్క నారాయణకే కాకుండా యావత్ భారతావనికే గర్వకారణం అని పేర్కొన్నారు. నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ శరణి నారా యణ మాట్లాడుతూ “ఈ రెండు బంగారు పతకాలు మా విద్యార్థుల ప్రతిభ, పట్టుదల, కష్టానికి నిదర్శనం. బణిబ్రత, అక్షత్ తమ తోటి విద్యార్థులకు ప్రేరణగా నిలిచారు. నారాయణలో మేము ఎల్లప్పుడూ సరైన వాతా వరణం, మార్గదర్శకత, అవకాశాలు అందిస్తూ విద్యార్థులు ఒలింపియాడ్ కలలను నిజం చేసే దిశగా కట్టుబడి ఉన్నామన్నారు. ఈ మనవిజయం నారాయణ యొక్క 46 ఏళ్ల విశిష్టమైన విద్యాప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచింది. జాతీయ, అంతర్జాతీయ ఒలింపియాడ్లతో పాటు జేఈఈ, నీట్ వంటి పోటీల్లోనూ నారాయణ నిరంతర విజయాలు సాధిస్తోంది. ప్రతి విజయం విద్యార్థులను వారి అసలైన సామర్ధ్యానికి దగ్గర చేస్తుందన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: