హైదరాబాద్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu) నిర్మాణం విషయంలో అలసత్వం లేకుండా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సూచిం చారు. బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నగరంలో నిర్వహించారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Indiramma Indlu) అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇంఛార్జ్లు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధి అజెండాగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇందిరమ్మ ఇళ్లు రహదారులు సాగునీటి ప్రాజెక్టులు విద్య వైద్య రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతి పై చర్చించారు.
సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైజింగ్ తెలంగాణ లక్ష్యంగా సాగుతున్న పాలనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్లు నిబద్ధతతో నిజాయితీగా పని చేయాలని మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై రైతు భరోసా రైతు రుణమాఫి పై బిఆర్ఎస్ బిజెపి నేతలు చేస్తున్న అసత్య ప్రచారం క్షేత్ర స్థాయిలో తిప్పికొట్టాలని మంత్రి తుమ్మల తెలిపారు.
సన్నబియ్యం పథకం మహిళలకు ఉచిత ఆర్టీసి బస్సు ప్రయాణం రైతు భరోసా
సన్నబియ్యం పథకం మహిళలకు ఉచిత ఆర్టీసి బస్సు ప్రయాణం రైతు భరోసా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రభుత్వంపై ప్రజానీకం విశ్వాసంగా ఉన్నారని మంత్రి తుమ్మల తెలిపారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్ట్లు రహదారులు నిర్మాణంలో ఫోకస్ పెట్టాలని అన్ని వర్గాల వారికి పార్టీలకు అతీతంగా ప్రజా పాలనలో పారదర్శకంగా ఉండాలని మంత్రి తుమ్మల తెలిపారు.
పత్తి వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగు వైపు రైతాంగం ఆసక్తి కలిగేలా ప్రోత్సహించాలని అభివృద్ధిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా తనదైన ముద్ర వేయాలని మంత్రి తుమ్మల అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల తో పాటు పార్టీ బలోపేతం పై ప్రధాన దృష్టి పెట్టాలని, గత ప్రభుత్వ అరాచక అవినీతి కోటలు బద్దలు కొట్టి కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం చేయాలని బిజెపి, బిఆర్ఎస్ రెండు పార్టీలు ఎలా తెలంగాణ అభివృద్ధికి అడ్డు పడుతున్నారనే విషయాలపై పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి తుమ్మల దిశా నిర్దేశం చేశారు.