కావలసిన పదార్థాలు:
- గోంగూర ఆకుల తరుగు – రెండు కప్పులు
- సెనగపప్పు – పావు కప్పు (అరగంటసేపు నానబెట్టుకోవాలి)
- చిన్న ఉల్లిపాయలు – పది
- పచ్చిమిర్చి – అయిదు
- పసుపు – పావు స్పూను
- జీలకర్ర – ఒక స్పూను
- ఆవాలు – ఒక స్పూను
- ఎండుమిర్చి – నాలుగు
- కారప్పొడి – రెండు టేబుల్ స్పూన్లు
- ఉప్పు – తగినంత
- నూనె – రెండు టేబుల్ స్పూన్లు

తయారు చేసే విధానం:
ఓ గిన్నెలో గోంగూర ఆకుల తరుగు, ఉల్లిపాయలు(Onions),సెనగపప్పు, పచ్చిమిర్చి తీసుకుని అవి మునిగేలా నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి. గోంగూర, సెనగపప్పు ఉడికాక తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి సిమ్లో పెట్టాలి. స్టౌ మీద కడాయి పెట్టి నూనె(oil) వేసి ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేయించుకుని పులుసుతో వేసి చిక్కగా అవుతున్నప్పుడు దింపేయాలి.

Read also: hindi.vaartha.com
Read also: