ఆధునిక సమాజంలో కుటుంబ వ్యవస్థ క్రమంగా క్షీణిస్తున్నదనడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా అక్రమ సంబంధాల వల్ల జరిగే దారుణాలు అత్యంత కలచివేసే అంశాలు. భార్యాభర్తల మధ్య నమ్మకం, ప్రేమ, ఆప్యాయతలు తగ్గిపోతున్న తరుణంలో, పరాయి వ్యక్తుల పట్ల ఆకర్షణ పెరగడం వల్ల ఎన్నో కుటుంబాలు చీలిపోతున్నాయి.తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం (Gannavaram Mandal, Krishna District) వెంకట నరసింహపురంలో చోటుచేసుకున్న ఒక సంఘటన ఇందుకు నిదర్శనం.వివరాల్లోకి వెళ్తే – లక్ష్మణ్, పావని అనే జంట సుమారు 15 ఏళ్ల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమవివాహం చేసుకున్నా కూడా వీరి జీవితం చక్కగా సాగింది. అద్దెకు ఒక ఇంట్లో నివసిస్తూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించారు.
ఘటన వివరాలు
వీరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా పుట్టారు. మొత్తం మీద ఓ సంతోషకరమైన కుటుంబం అని చుట్టుపక్కల వారు అనుకునేంతగా వీరి జీవితం నడుస్తున్నది.అయితే ఈ సౌఖ్యం ఎక్కువ కాలం నిలవలేదు. వీరి జీవితంలోకి సమీప బంధువు ప్రదీప్ ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి మారిపోయింది. పావని, ప్రదీప్ల మధ్య అనుచితమైన పరిచయం ఏర్పడి క్రమంగా అది అక్రమ సంబంధంగా మారింది. ఈ వ్యవహారం లక్ష్మణ్ (Lakshman) కు తెలిసే వరకు, పావని ప్రదీప్తో సంబంధాలు కొనసాగించింది. కానీ భర్తకు ఈ విషయం తెలిసిన తర్వాత, ఇంట్లో తగాదాలు మొదలయ్యాయి.ప్రదీప్తో సంబంధాలు కొనసాగించడం పట్ల లక్ష్మణ్ పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశాడు.ఏం జరిగిందో ఏమో.. తెలీదు కానీ ఈనెల 13వ తేదీన నరసింహపురంలో లక్ష్మణ్ విగతజీవిగా పడి ఉన్నాడు. బార్య పావని ఏమి తెలియనట్లు హడావుడిగా చింతకుంట గ్రామంలో అంత్యక్రియలు జరిపించింది.

ప్రదీప్ తో కలిసి హత్య చేసినట్లు పావని ఒప్పుకుంది
అయితే భార్య వ్యవహారపై శైలిపై అనుమానం వచ్చిన భర్త తరపు బంధువులు ఆరా తీశారు.. ఈ క్రమంలోనే.. పావని – ప్రదీప్ మధ్య ఉన్న సంబంధం బయటపడింది.అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తానే ప్రియుడు ప్రదీప్ తో కలిసి హత్య చేసినట్లు పావని ఒప్పుకుంది. ఈ ఘటనపై లక్ష్మణ్ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి ప్రదీప్ – పావనిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేశామని.. పోస్టుమార్టం నిర్వహించేందుకు మృతదేహాన్ని వెలికితీస్తామని పోలీసులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: