Terrorism: ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఆపరేషన్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారీ స్థాయిలో దాడులు జరిగాయి. జైష్-ఎ-మహమ్మద్,(Jaish-e-Mohammed) లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థలు నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రాలు, సురక్షిత ప్రాంతాలు ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి. ఈ దాడులకు ప్రతిస్పందనగా ఇప్పుడు జైష్-ఎ-మహమ్మద్ మళ్లీ తమ నెట్‌వర్క్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటుండటంతో భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి.
ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం, పాకిస్తాన్ వ్యాప్తంగా 313 కొత్త ఉగ్ర శిక్షణా స్థావరాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ఈ కేంద్రాల్లో జైష్ సంస్థలో కొత్తగా చేరే ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా, మసూద్ అజార్ కుటుంబానికి సురక్షిత ఆశ్రయం కల్పించడమనే ఉద్దేశం ఉంది. ఈ కేంద్రాలన్నీ స్ట్రాటజిక్ ప్రదేశాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. పాకిస్థాన్‌లోని హరిపూర్, అబోటాబాద్, మిర్‌పూర్ వంటి ప్రాంతాల్లో జైష్ కార్యకలాపాలు గణనీయంగా పెరిగినట్లు సమాచారం.

నిఘా విభాగాల ప్రకారం
ఈ నెట్‌వర్క్ ఏర్పాటుకు అవసరమైన నిధుల కోసం జైష్ సంస్థ సుమారు 3.91 బిలియన్ పాకిస్తానీ రూపాయల సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధుల సేకరణకు మసూద్ అజార్, అతడి సోదరుడు తల్హా అల్ సైఫ్ నేతృత్వం వహిస్తున్నారు. వీరిద్దరూ EasyPaisa, SadaPay వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను(Digital platforms) వినియోగించి ఆన్‌లైన్ విరాళాలను సేకరిస్తున్నారు. గాజాలో మానవతా సహాయం పేరిట మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఉగ్ర విరాళాలు సేకరించే చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ డొనేషన్లకు సంబంధించిన డిజిటల్ లావాదేవీల ఆధారాలు దర్యాప్తు సంస్థలకు లభించినట్లు సమాచారం.
భారీ ఎత్తున నిధుల సేకరణ
దర్యాప్తులో తల్హా అల్ సైఫ్ పేరిట ఉన్న డిజిటల్ వాలెట్ ఖాతా ఒక పాక్ మొబైల్ నంబరుతో లింక్ అయినట్లు గుర్తించారు. ఆ నంబరు హరిపూర్ జిల్లాకు చెందిన జైష్ కమాండర్ అఫ్తాబ్ అహ్మద్ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. ఈ నేపథ్యంలో జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద కార్యకలాపాలు తిరిగి ఊపందుకుంటున్న విషయం స్పష్టమవుతోంది. భారత్ ఇప్పటికే పహల్గాం దాడి తరువాత తన భద్రతా వ్యవస్థను బలోపేతం చేసినప్పటికీ, ఈ కొత్త నెట్‌వర్క్ దేశానికి తీవ్రమైన సవాలుగా మారే అవకాశముంది.
జైష్-ఎ-మహమ్మద్ సంస్థ ఇప్పుడు ఏమి చేస్తోంది?
ఈ సంస్థ పాకిస్తాన్‌లో మళ్లీ 313 కొత్త ఉగ్ర శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ కేంద్రాల ద్వారా కొత్త ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఉగ్ర సంస్థ నిధులు ఎలా సమీకరిస్తోంది?
జైష్ సుమారు ₹3.91 బిలియన్ పాకిస్తానీ రూపాయలు సేకరించేందుకు ప్లాన్ వేసింది. EasyPaisa, SadaPay వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి ఆన్‌లైన్ విరాళాలు సేకరిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: