ఉప్పల్ ఐడీఏలోని ఒక ఐటీ సంస్థలో జీతం కోసం అడిగిన ఉద్యోగులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు (Software employees) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
జీతం అడిగిన ఉద్యోగులపై చర్యలు
ఫ్రూజెస్ ఐటీ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఔట్ సోర్సింగ్ ఆధారంగా పనిచేస్తున్న 14 మంది ఉద్యోగులు జులై నెల జీతం ఎప్పుడిస్తారో మంగళవారం యాజమాన్యాన్ని అడిగారు. అయితే, ఈ అడిగిన ప్రశ్నే పెద్ద సమస్యగా మారి, మేనేజ్మెంట్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.

రాత్రి పూట పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టిన ఉద్యోగులు
సమాచారం అందుకున్న పోలీసులు ఉద్యోగులను ఉప్పల్ (Uppal) పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. బుధవారం ఉదయం వరకు స్టేషన్‌లోనే కూర్చోబెట్టారని ఉద్యోగులు తెలిపారు. ఈ సంఘటన తమకు తీవ్ర మానసిక వేదన కలిగించిందని వారు వాపోయారు. అయితే ఉద్యోగులు కంపెనీ ప్రాంగణంలో గొడవ సృష్టించారని, అందుకే మేనేజ్మెంట్ ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకే వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చామని స్పష్టం చేశారు.
ఉద్యోగుల ఆవేదన
“జీతం అడగడం తప్పా? పని చేసినందుకు వేతనం కావాలని అడిగితే ఇంత పెద్ద శిక్ష విధించాలా?” అంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాల్సిన సమయంలో మరింత ఇబ్బందులు కలిగించారని వారు ఆరోపించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: