కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొన్ని నూతన బిల్లులు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా కేబినెట్ మంత్రులు ఎవరిదైనా 30 రోజులకు మించి కస్టడీలో ఉంటే వారి పదవులు తాత్కాలికంగా రద్దు చేయాలనే నిబంధన కలిగిన ఈ బిల్లుపై విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది రాజకీయంగా అసమానతలు కలిగించవచ్చని వారు భావిస్తున్నారు. అయితే, ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) భిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది.
లోక్‌సభ సమావేశం వాయిదా పడిన అనంతరం శశి థరూర్ మాట్లాడుతూ, “ఎవైనా 30 రోజులు జైలులో ఉంటే, వారు మంత్రి పదవిలో ఎలా కొనసాగగలరు? ఇది చాలా సాదారణమైన మరియు తార్కికమైన విషయం,” అని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఆయన పార్టీ అధికారిక వైఖరికి విరుద్ధంగా ఉండడం గమనార్హం. ఈ అంశంపై విపక్షాలు ఒకతాటిపై ఉండగా, శశి థరూర్ స్పందన దీనికి భిన్నంగా ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ కి షాక్ ఇచ్చిన.. శశిథరూర్
అయితే, బిల్లును తాను పూర్తిగా చదవలేదని, తన అభిప్రాయం తుది నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు. బిల్లులోని వివిధ అంశాలపై సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి (జెపిసి) పంపి, లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య(Democratic) పరిరక్షణకు దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపే యోచన ప్రభుత్వ వర్గాల్లో ఉన్న నేపథ్యంలో, శశి థరూర్ దానిని స్వాగతించారు. ఇది పార్లమెంటరీ వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుందని, ప్రజల అభిప్రాయాలకు అవకాశం కల్పించే విధంగా ఉందని చెప్పారు. బిల్లును రద్దు చేయాలని కాదు, కానీ చర్చించి, సమర్థవంతంగా మార్చాలని ఆయన సూచించిన తీరు, రాజకీయ శైలి పరంగా విభిన్నంగా కనిపిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుల మూల ఉద్దేశ్యం ఏమిటి?
కొత్త బిల్లుల ప్రకారం, ప్రధాని, సీఎం లేదా మంత్రులు 30 రోజుల కంటే ఎక్కువకాలం నిరంతరంగా జైలులో ఉంటే, వారి పదవిని రద్దు చేయవచ్చు. ఇది అవినీతిని అరికట్టేందుకు తీసుకొచ్చిన చర్యగా చెప్పబడుతోంది.
ఈ బిల్లులపై విపక్షాలు ఎలా స్పందించాయి?
విపక్షాలు దీన్ని రాజకీయం చేస్తూ, ప్రత్యర్థులను లక్ష్యం చేసే ప్రయత్నంగా అభివర్ణించాయి. వారు ఈ బిల్లులను విస్తృతంగా వ్యతిరేకిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: