ఈస్ట్ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటవారిగూడెం గ్రామంలో పెద్ద కలకలం రేగింది. ఒక బర్త్‌డే వేడుక పేరిట అక్కడ జరిగిన రేవ్ పార్టీ (Rave Party) ,ప్రాంతంలో సంచలనం సృష్టించింది. స్థానికుల నుండి అందిన సమాచారం ఆధారంగా పోలీసులు అక్కడికి చేరుకుని భారీ దాడి చేశారు.మొదట బర్త్‌డే వేడుక పేరుతో కార్యక్రమం మొదలైందని చెబుతున్నారు. అయితే రాత్రి గడుస్తున్న కొద్దీ అది అశ్లీల నృత్యాలతో కూడిన రేవ్ పార్టీగా మారిందని పోలీసులు తెలిపారు. పలు యువతులు మద్యం మత్తులో అసభ్యకరమైన ప్రవర్తనకు దిగగా, యువకులు కూడా ఆ వాతావరణంలో అదుపు తప్పి దుర్వ్యవహారానికి పాల్పడ్డారని సమాచారం.

కేసులు నమోదు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు
ఈ వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు వెజ్జే సుబ్బారావు (Jana Sena Party leader Vejje Subbarao) బర్త్‌డే జరుపుకుంటున్నారన్న వార్త బయటకు రావడంతో కేసు మరింత హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమం కోసం పలు ప్రాంతాల నుండి యువతులు, యువకులు హాజరయ్యారని తెలుస్తోంది.పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ప్రదేశాన్ని ముట్టడి చేసి 23 మంది యువకులు, 3 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 26 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అదేవిధంగా, ఆ పార్టీకి వచ్చిన పలు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
రేవ్ పార్టీ అంటే ఏమిటి?
రేవ్ పార్టీ అనేది సాధారణంగా రాత్రిపూట జరిగే, గందరగోళమైన సంగీతం, డ్యాన్స్, మద్యం, మత్తు పదార్థాల వినియోగం ఉండే పార్టీ. ఇటువంటి పార్టీలు ఎక్కువగా ప్రైవేట్ ఫార్మ్‌హౌస్‌లు, రిసార్ట్స్, బీచ్‌లు లేదా బహిరంగ ప్రదేశాల్లో రహస్యంగా నిర్వహిస్తారు.
రేవ్ పార్టీలలో ఏమి జరుగుతుంది?
ఇందులో ప్రధానంగా డిజే మ్యూజిక్, డ్యాన్స్, మద్యం సేవనం, కొన్నిసార్లు నిషేధిత మత్తు పదార్థాల వినియోగం జరుగుతుందని పోలీసులు చెబుతుంటారు. ఎక్కువగా యువత ఈ పార్టీలకు హాజరవుతారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: