భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కొత్త భారీ రాకెట్‌ను నిర్మిస్తోంది. ఈ రాకెట్ ఎత్తు ఏకంగా 40 అంతస్తుల భవనం అంత ఉంటుంది. ఈ విషయాన్ని ఇస్రో (ISRO) ఛైర్మన్ వి. నారాయణన్ ప్రకటించారు.
ఇస్రో ఈ ఏడాదిలోనే నావిక్ శాటిలైట్, ఎన్-1 రాకెట్ ప్రయోగం, అలాగే అమెరికాకు చెందిన పెద్ద కమ్యూనికేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి పంపించనుంది.
గతంలో అబ్దుల్ కలామ్ చేసిన ప్రాజెక్టులను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చిన్న రాకెట్ 35 కిలోల శాటిలైట్‌ను మాత్రమే మోసేది.
75 టన్నుల బరువైన పేలోడ్‌ను కక్ష్యలోకి పంపగలిగే స్థాయికి ఇస్రో చేరింది.
ప్రస్తుతం భారత్‌కు 55 శాటిలైట్‌లు కక్ష్యలో ఉన్నాయి. రాబోయే 3-4 ఏళ్లలో ఈ సంఖ్య మూడు, నాలుగు రెట్లు పెరుగుతుంది.
ఇక ఇస్రో ప్రస్తుతం గగన్‌యాన్ మిషన్ (మూడు భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ప్రాజెక్ట్) పై పనిచేస్తోంది. ఇది 2026లో జరగనుంది.
ఈ మిషన్ విజయవంతం అయితే, భారత్ అమెరికా, రష్యా, చైనా తర్వాత అంతరిక్షంలో మనుషులను పంపిన నాలుగో దేశం అవుతుంది.
ఇక చంద్రయాన్-3 విజయానికి తరువాత, ఇప్పుడు చంద్రయాన్-4 పై కూడా ఇస్రో పని చేస్తోంది. చంద్రుడి ఉపరితలం నుంచి మట్టి నమూనాలు సేకరించి భూమికి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ మిషన్‌ను 2027లో ప్రయోగించనున్నారు.
Read also :