హైదరాబాద్ Urea : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) తరచూ షట్ డౌన్ ఆయి, యూరియా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడు తుండటంపై రాష్ట్ర సర్కార్ దృష్టిసారించింది. షట్ డౌన్ ఎందుకు అవుతుందనే విషయమై ప్రభుత్వం అంతర్గత విచారణ చేయిస్తున్నట్లు సమాచారం. ప్లాంట్ ద్వారా ఈ నెలాఖరు వరకు రాష్ట్రానికి 65 వేల టన్నుల యూరియా రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 20 వేల టన్నులు (Thousands of tons) మాత్రమే సరఫరా అయ్యింది. జూలై నుంచి వరి సాగవుతున్న సమయంలోనే ఒక్కసారిగా యూరియా కొరత ఏర్పడింది. ఇందుకు కారణం ఆర్ఎఫ్సీఎల్ తరచూ షట్ డౌన్ అవుతుండడమేనని తెలుస్తున్నది. ఈ ఏడాది మే 8 నుంచి జూన్ 15 వరకు, జూలై 16 నుంచి ఆగస్టు 4 వరకు ఉత్పత్తి నిలిచిపోయింది. మళ్లీ ఆగస్టు 14న అమ్మోనియా లీకేజీతో ప్లాంట్ షట్డౌన్ అయ్యింది. ఈ వరుస వైఫల్యాలతో తెలంగాణకు లక్ష టన్నులకు పైగా యూరియా సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఈ నెలలో 65 వేల టన్నులు సరఫరా జరగాల్సి ఉంది. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కావాలనే పరిశ్రమను షట్ డౌన్ చేస్తున్నారా, లేక అమ్మోనియా లీక్తోనే షట్ డౌన్ అవుతున్నదా ఆనేవిషయాలతో పాటు, పరిశ్రమలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం తోనే తరచూ లీకేజీలు తలెత్తు తున్నాయా అనే కోణంపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలియవచ్చింది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :