తమిళనాడులో 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దశాబ్దానికి సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో రాజకీయ వర్గాలు, పార్టీలు తమ తుది వ్యూహాలను సిద్దం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో, ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నేత విజయ్ తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) విజయంపై ధీమా వ్యక్తం చేశారు. విజయ్ (Vijay) తాజాగా తన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆయన ప్రకటనలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే చరిత్రాత్మక విజయం సాధించడమే లక్ష్యమని స్పష్టంగా పేర్కొన్నారు. “ప్రజలతో మమేకమై, వారి సమస్యలను విని, వారి సంక్షేమాన్ని ముందుగా ఉంచే పార్టీగా మేము కొనసాగుతున్నాం. రాబోయే ఎన్నికల్లో మా పార్టీ ప్రతి నియోజకవర్గంలో ప్రజల వాక్కు తీసుకోవడానికి సిద్దంగా ఉంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.

తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని
1967, 1977 సంవత్సరాల్లో వచ్చిన చరిత్రాత్మక ఎన్నికల ఫలితాల (Historic election results) ను 2026లో మళ్లీ చూడబోతున్నామని విజయ్ జోస్యం చెప్పారు. అపారమైన ప్రజాశక్తితో ఈ కలను తాము నిజం చేయబోతున్నామని పేర్కొన్నారు. “తమిళ ప్రజలను ప్రాణానికి ప్రాణంగా భావించే ఈ విజయ్ గురించి మీకు బాగా తెలుసు. మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇక కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.పార్టీ విజయం కోసం అభిమానులు, యువత, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే ఏకైక ధ్యేయంగా మనస్సాక్షి ఉన్న ప్రజాపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారమే లక్ష్యంగా ముందుకు సాగి, తమిళ గడ్డపై సరికొత్త ఫలితాన్ని కచ్చితంగా చూపిస్తామని అన్నారు. ఎన్నికలు అనే రాజకీయ యుద్ధంలో గెలుస్తామని, అంతా మంచే జరుగుతుందని, విజయం తథ్యమని విజయ్ తన ప్రకటనలో పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
తలపతి విజయ్ పూర్తి పేరు ఏమిటి?
ఆయన పూర్తి పేరు జోసఫ్ విజయ్. సినిమా పరిశ్రమలో “తలపతి” అనే టైటిల్‌తో ప్రసిద్ధి చెందారు.
విజయ్ సినీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది?
ఆయన 1992లో Naalaiya Theerpu అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత అనేక హిట్ సినిమాలు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: