వరంగల్ జిల్లాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన స్థానికులను తీవ్రంగా కుదిపేసింది. వివాహేతర సంబంధం బయటపడుతుందేమోనని భయపడి ఒక భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ఖతర్నాక్ ప్లాన్ వేసింది. ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి భర్తను కడతేర్చేందుకు పక్కా స్కెచ్ వేశారు. అనుకున్నట్లే భర్తను బయటకు తీసుకెళ్లి అతికిరాతకంగా చిత్రహింసలు పెట్టారు. కానీ చనిపోయాడనుకున్న భర్త ప్రాణాలతో బయటపడటంతో అసలు కుట్ర బయటపడింది. ఈ ఘటన వరంగల్ నగరంలోని మట్వాడ పోలీస్ స్టేషన్ (Matwada Police Station) పరిధిలో చోటుచేసుకుంది.వరంగల్‌లోని రామన్నపేట ప్రాంతం, రఘునాథ్ కాలనీలో నివసిస్తున్న రాజు అనే వ్యక్తి ఈ దాడికి గురయ్యాడు. 14వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాజును పోతననగర్ డంపింగ్ యార్డ్ సమీపానికి తీసుకెళ్లి, కత్తులు, ఇనుప రాడ్లతో అత్యంత కిరాతకంగా చిత్రహింసలు పెట్టారు.
ఘటన వివరాలు
అతను చనిపోయాడని భావించి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. రక్తపాతంలో పడి ఉన్న రాజును స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో రాజు ప్రాణాలతో బయటపడ్డాడు.అతన్ని హాస్పిటల్‌కి తరలించి విచారణ చేపట్టిన పోలీసులకు అసలు కథ తెలిసింది.ఈ సంఘటన వరంగల్ రామన్నపేట (Warangal Ramannapeta) ప్రాంతంలోని రఘునాథ్ కాలనీలో జరిగింది.. గంగరబోయిన పద్మకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మోత్కులగూడేనికి చెందిన పోతుల సందీప్ తో మూడు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది.. ఈ క్రమంలో ప్రియుడు సందీప్ కు తన భర్త రాజుతో స్నేహం చేసి ఇంటికి వచ్చేలా ప్లాన్ చేసింది.

రాజుకు ఈ విషయం తెలియడంతో
పద్మ భర్త రాజు ప్రయివేట్ చిట్టీలు వేసేవాడు. సందీప్‌తో తన భర్త వద్ద చిట్టీలు వేయించిన పద్మ నిత్యం సందీప్ తన ఇంటికి వచ్చేలా లైన్ క్లియర్ చేసింది. రాజు ఇంట్లోలేని సమయంలో కూడా సందీప్ తరచుగా వచ్చి తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని.. ఇరుగు పొరుగు వారి ద్వారా రాజు చెవిన పడింది.రాజుకు ఈ విషయం తెలియడంతో.. అతను భార్య పద్మను మందలించాడు.. ఈ క్రమంలో హైరానా పడిపోయిన భార్య పద్మ.. ప్రియుడు సందీప్‌తో కలిసిభర్త హత్యకు స్కెచ్ వేసింది. తన ప్రియుడికి కొంతడబ్బు సుపారి ఇచ్చి భర్తను అడ్డు తొలగించాలని ప్లాన్ చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఈ నెల 14వ తేదీన సందీప్ తన స్నేహితులు ప్రమోద్, షబ్బీర్, స్వర్ణాకర్‌తో కలిసి పోతననగర్ డంపింగ్ యార్డు వద్ద రాజుపై దాడికి పాల్పడ్డారు. అతన్ని విచక్షణా రహితంగా కొట్టి గొంతునులిమి హత్యాయత్నం చేశారు.
చాలా సేపు అపస్మారక స్థితిలోనే ఉన్నాడు
దాడి అనంతరం.. అతడు స్పృహ తప్పి పడిపోవడంతో చనిపోయాడనుకోని అక్కడ నుండి వెళ్లిపోయారు.. రాజు చాలా సేపు అపస్మారక స్థితిలోనే ఉన్నాడు.. ఈ క్రమంలోనే.. డంపింగ్ యార్డు వద్ద రాజును గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన జరిగిన వెంటనే పద్మ.. రాజుపై చంపారనుకుని.. వెంటనే సందీప్ కు రూ.3 లక్షలు అందజేసినట్లు పోలీసులు గుర్తించారు.అయితే.. రాజు బతికి ఉన్నాడనే విషయం తెలుసుకున్న పద్మ అదేరాత్రి ఇంటిలో ఉన్న మరో 6 లక్షల రూపాయలు తీసుకుని సందీప్ తో వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాజు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సందీప్, పద్మను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరో ముగ్గరు ప్రమోద్, షబ్బీర్, స్వర్ణాకర్ పరారీలో ఉన్నారు.. అరెస్టయిన వారి వద్ద 5.లక్షల 40 వేల రూపాయల నగదు.. ఓ కారు, రెండు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: