Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న సమయంలో తెలంగాణ హైదరాబాద్ వాసులను విఐపి (VIP) బ్రేక్ దర్శనాల పేరుతో దళారీలు భారీగా మోసం చేశారు. ఏకంగా 90వేల రూపాయలు నగదు తీసుకుని ఆ తరువాత విఐపి బ్రేక్ దర్శనాలు కల్పించకపోగా ఏకంగా చరవాణి(సెల్ఫోన్)లో స్పందించలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన హైదరాబాద్ వాసి వై. విశ్వనాధ్ టిటిడి విజిలెన్స్కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్కు చెందిన ఆ ఇద్దరు వనం నటరాజ నరేంద్రకుమార్, కెఎస్ నగరాజశర్మ విఐపి బ్రేక్ దర్శనాల కోసం వై. విశ్వనాధ్ నుండి డబ్బులు తీసుకున్నారు. తను ఈనెల 16 వతేదీ బ్రేక్ దర్శనం చేయిస్తానని 90వేలు రూపాయలు నగదు వసూలుచేశారు. తీరా భక్తులు తిరుమలకు చేరుకుని దర్శనాలు విషయంగా ఫోన్చేసినా స్పందించలేదు. దీనిపై బాధితుడు తిరుమల విజిలెన్స్ వింగ్కు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన విజిలెన్స్ వింగ్ విఎస్ ఒ ఎన్టీవిరామ్కుమార్ ఆ ఇద్దరు నిందితులు జంట నగరాల్లో పలువురిని మోసం చేస్తున్నారని, వీరిపై దాదాపు 12 పోలీస్ కేసులు నమోదైనట్లు తెలిపారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న దళారులు టిటిడి ఉద్యోగులు కారని, టిటిడికి సంబంధంలేదని పేర్కొంది.భక్తుల నుండి తరచూ దర్శన టిక్కెట్ల బుకింగ్పై టిటిడికి ఫిర్యాదులు అందుతున్నాయి. శ్రీవారి దర్శనం, వసతికోసం భక్తులు టిటిడి వెబ్సైట్ను ఆశ్రయించి బుకింగ్ చేసుకోవాలని టిటిడి విజుప్తి చేసింది. టిటిడి (TTD) సేవలకు www.ttdevasthanams.ap. gov.. ఇన్”లో బుక్చేసుకోవాలని, టిటిడి సమాచారం కోసం టోల్ ప్రీనంబర్ 155257ను సంప్రదించాలని సూచించింది. దళారులపై అనుమానం వస్తే టిటిడి విజిలెన్స్ అధికారులు 0877- 2263828 నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించింది.

READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :