ఉక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశం కనిపిస్తోంది. శాంతి ఒప్పందానికి మార్గం అవుతుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తొలిసారిగా ఓ కీలక అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది.వైట్‌హౌస్‌లో సోమవారం జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో పాటు యూరోపియన్ దేశాధినేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, పుతిన్ ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు, అని చెప్పారు. ఇది శాంతికి ఒక గొప్ప ముందడుగు అని ఆయన అభివర్ణించారు.

యూరోపియన్ దేశాలకు కీలక భాధ్యత
ఈ ఒప్పందంలో యూరోపియన్ దేశాల పాత్ర చాలా ముఖ్యమైందని ట్రంప్ వివరించారు. భద్రత విషయంలో ఎక్కువ బాధ్యత యూరప్ తీసుకుంటుందని చెప్పారు. మేము సహాయం చేస్తాం. కానీ ప్రధాన భాధ్యత వాళ్లదే, అన్నారు.ఈ భద్రతా ఒప్పందం ద్వారా ఉక్రెయిన్‌పై ఇక దాడులే జరగవని ట్రంప్ నమ్మకం వ్యక్తం చేశారు. జెలెన్స్కీ కూడా ఈ విషయంపై ఆశాభావం వ్యక్తం చేశారు. తమ దేశానికి శక్తివంతమైన రక్షణ అవసరమని, అమెరికా మద్దతు కీలకమని చెప్పారు.శాంతి ఒప్పందంలో భాగంగా ప్రస్తుత సరిహద్దులను పరిగణలోకి తీసుకుంటూ భూభాగాల మార్పులపై చర్చ జరుగుతుందని ట్రంప్ సూచించారు. అయితే, ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని తెలుస్తోంది.
ట్రంప్, పుతిన్, జెలెన్స్కీ త్రైపాక్షిక భేటీ?
ట్రంప్ మాట్లాడుతూ, అవసరమైతే తాను పుతిన్, జెలెన్స్కీలతో కలిసి త్రైపాక్షిక సమావేశానికి సిద్ధమని ప్రకటించారు. ఇది శాంతి ప్రక్రియలో మరో కీలక అడుగు కావచ్చు.గత సమావేశంతో పోలిస్తే, ఈసారి వైట్‌హౌస్ వాతావరణం ఎంతో స్నేహపూర్వకంగా కనిపించింది. మునుపు మిలిటరీ దుస్తుల్లో కనిపించిన జెలెన్స్కీ, ఈసారి ఫార్మల్ సూట్లో వచ్చారు. ఈ స్టైల్ మార్పుపై ట్రంప్ కూడా సరదాగా స్పందించారు.ఈ భేటీలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఫిన్లాండ్ నేతలు పాల్గొన్నారు.
Read Also :