భారత్-చైనా (India-China) సంబంధాలు పునరుద్ధరించాలంటే నిజాయితీ అవసరమని జైశంకర్ (S Jaishankar) స్పష్టం చేశారు. సOభాషణ, పరస్పర గౌరవం, ప్రయోజనాలపై బంధం ఉండాలన్నారు.చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చారు. ఆయనతో సోమవారం జైశంకర్ సమావేశమై విస్తృతంగా చర్చించారు.జైశంకర్ మాట్లాడుతూ, విభేదాలు వివాదాలు కాకూడదు. పోటీ సంఘర్షణకు దారితీయకూడదు అని పేర్కొన్నారు. స్పష్టమైన శాంతియుత మార్గమే అవసరమని అన్నారు.సరిహద్దుల్లో శాంతి ఉంటేనే సంబంధాలు మెరుగవుతాయని జైశంకర్ అన్నారు. బలగాల ఉపసంహరణ ప్రక్రియ వేగంగా సాగాలన్నారు. చర్చలు పటిష్టంగా జరగాలన్నారు.
వాంగ్ యీ స్పందన
వాంగ్ యీ మాట్లాడుతూ, శాంతియుత పరిస్థితులు కొనసాగుతున్నాయి. మానస సరోవర్ యాత్రలకు అనుమతి ఇచ్చాం, అన్నారు. చర్చలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.వాంగ్ యీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీతో సమావేశం కానున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో కూడా సమావేశమవుతారు.2020లో గల్వాన్ లోయ ఘటన తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి. తూర్పు లడఖ్‌లో నాలుగేళ్లుగా సైనిక ప్రతిష్టంభన కొనసాగుతోంది.
ఎల్ఏసీ పరిణామాలపై చర్చలు కీలకం
ఈ నేపథ్యంలో ఎల్ఏసీ వెంబడి పరిస్థితులపై చర్చలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శాంతిని లక్ష్యంగా పెట్టుకుని చర్చలు జరిగాయి.ప్రధాని మోదీ త్వరలో చైనా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ చర్చలు కీలకం. ఉద్రిక్తత తగ్గించేందుకు ఇది సానుకూల అడుగు అయ్యింది.ఇరు దేశాల మధ్య నమ్మకం పెరగాలి. మాట్లాడుకోవడం వల్లే పరిష్కారాలు కనపడతాయి. జైశంకర్ మాటల్లో ఆశ ఉంది.భారత్-చైనా మధ్య సంబంధాలు క్లిష్టంగా ఉన్నాయి. అయినా, సంభాషణతో పరిష్కారాలకు దారులు తెరచవచ్చు. శాంతి, పరస్పర గౌరవమే భవిష్యత్తు బంధానికి బలమవుతుంది.
Read Also :