పాకిస్తాన్ అంతటా కురిసిన భారీ వర్షాలు (Pakistan Rains) ఆకస్మిక వరదలకు దారితీశాయి. ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ (Khyber Pakhtunkhwa Province) తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడ పలు గ్రామాలు పూర్తిగా వరద ముంపులో కొట్టుకుపోయాయి. వాహనాలు, ఇళ్లు, దుకాణాలు ఒక్కసారిగా జలప్రవాహంలో కొట్టుకుపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళనలో మునిగిపోయారు.

అధికారిక గణాంకాలు భయంకరమే
పాకిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) విడుదల చేసిన వివరాల ప్రకారం, జూన్ 26 నుంచి ఇప్పటివరకు సుమారు 657 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలు కూడా ఉన్నారు. అదేవిధంగా 929 మందికి పైగా గాయపడ్డారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
బునెర్ జిల్లా పూర్తిగా దెబ్బతింది
వరదల వల్ల అత్యంత దారుణంగా ప్రభావితమైన జిల్లాల్లో బునెర్ జిల్లా ఒకటి. ముఖ్యంగా బషోని గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన 25 మంది మరణించడం విషాదాన్ని మరింత పెంచింది. శిథిలాల కింద చిక్కుకున్న వారికి బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి.
సహాయక చర్యలకు ఆటంకాలు
ప్రభుత్వం, రెస్క్యూ బృందాలు ప్రభావితులను రక్షించడానికి, వారికి ఆహారం, నీరు అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే రోడ్లు దెబ్బతినడం, మౌలిక సదుపాయాలు ధ్వంసం కావడం వల్ల సహాయక చర్యలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. పలుచోట్ల సహాయక బృందాలు చేరడమే కష్టమవుతోంది.
వాతావరణ మార్పుల ప్రభావం
నిపుణుల ప్రకారం పాకిస్తాన్ తరచుగా ఇలాంటి విపత్తులకు వాతావరణ మార్పులే ప్రధాన కారణం. ఈ సారి కురిసిన వర్షపాతం సాధారణం కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉంది. వర్షాల తీవ్రతే ఇంత పెద్ద విధ్వంసానికి దారితీసిందని వారు చెబుతున్నారు. ఇకపై మరికొన్ని రోజుల పాటు కుండపోత వర్షాలు కొనసాగే అవకాశం ఉందని పాక్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: