हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Samyuktha Menon: నాకు మద్యం తాగే అలవాటుందన్న నటి సంయుక్త మీనన్

Sharanya
Samyuktha Menon: నాకు మద్యం తాగే అలవాటుందన్న నటి సంయుక్త మీనన్

తెలుగులో వరుస విజయాలతో ‘గోల్డెన్ బ్యూటీ’గా గుర్తింపు పొందిన నటి సంయుక్త మీనన్ (Samyuktha Menon) తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తనకు మద్యం సేవించే అలవాటు (Alcohol drinking habit) ఉందని ఆమె బహిరంగంగా వెల్లడించడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు.

Samyuktha Menon
Samyuktha Menon

మద్యం అలవాటు పై సంయుక్త స్పష్టీకరణ

తనకు మద్యం తాగే అలవాటు ఉందని ఆమె స్పష్టంగా అంగీకరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే, తాను ప్రతిరోజూ మద్యం సేవించనని, కేవలం తీవ్రమైన ఒత్తిడి లేదా ఆందోళనలో ఉన్నప్పుడు మాత్రమే కొద్దిగా తీసుకుంటానని చెప్పింది. మానసిక ప్రశాంతత కోసం అప్పుడప్పుడు ఇలా చేస్తానని ఆమె వివరించారు.

నెటిజన్ల రకరకాల స్పందనలు

సంజయుక్త (Samyuktha Menon) వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే అవి సోషల్ మీడియాలో వైరల్ (Viral on social media) అయ్యాయి. కొందరు నెటిజన్లు ఆమె నిజాయితీని ప్రశంసిస్తుంటే, మరికొందరు ఇలాంటి విషయాలను బహిరంగంగా చెప్పడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

సినీ కెరీర్‌లో సంయుక్త విజయాలు

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంయుక్త, తర్వాత సార్, విరూపాక్ష వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

రాబోయే ప్రాజెక్టులు

ప్రస్తుతం సంయుక్త పలు ప్రాజెక్టుల్లో నటిస్తోంది. బాలకృష్ణతో కలిసి నటించే అఖండ 2 ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. అదేవిధంగా స్వయంభు, నారి నారి నడుమ మురారి, పూరి జగన్నాథ్ ప్రాజెక్ట్‌తో పాటు విజయ్ సేతుపతితో కలిసి మరో చిత్రం చేస్తోంది. ఈ సినిమాలు షూటింగ్ దశలో కొనసాగుతున్నాయి.

Read hindi news: https://hindi.vaartha.com/

Read also:

https://vaartha.com/vijay-deverakonda-rashmika-celebrate-in-newyork/cinema/531877/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870