పెళ్లి చేసుకుని సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో ఆ దంపతులు పడుతున్న వేదనను మోసపూరితంగా లక్షలు కాజేయడానికి కొన్ని ఫెర్టిలిటీ వైద్య సంస్థలు కుట్రలు పన్నుతున్నాయి. మోసం జరిగిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తేనేగానీ అధికారులు వాటి జోలికి వెళ్లడం లేదు. పిల్లలు పుట్టని దంపతులకు (couple) వారి మనోవాంఛను పూర్తి చేయడానికి అనేక విధానాలు ఉన్నాయి. శాస్త్రీయ పద్ధతుల్లో వాటిని పరిష్కరించకుండా వేరే మార్గాల ద్వారా వారికి పిల్లలు పుట్టిస్తామని మోసం చేస్తున్న ఫెర్టిలిటీ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. సరైన స్కానింగ్ చేయకుండా, లోపం ఎక్కడ ఉందో గమనించకుండా గర్భంలో పిండాన్ని ఎలా కాపాడాలన్న అంశాన్ని పక్కన పెట్టి దంపతుల నుంచి ఎక్కువ మొత్తాలను ఎలా పిండాలన్న అంశంపైనే ఈ సంస్థలు (Institutions) ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. దీనితో సరోగసిని ముఖ్యంగా తెరపైకి తీసుకువస్తున్నారు. తమ రక్తం పంచుకుని పుట్టే బిడ్డ కావాలని ఆసక్తి చూపించే దంపతులకు ఈ సంస్థలు గాలం వేస్తున్నాయి.
లక్షల రూపాయలు వసూలు చేస్తారు.
ఒక్కసారి ఈ సంస్థల ప్రాంగణంలో అడుగు పెడితేలక్షల రూపాయలు వసూలు చేస్తారు. వివిధ రకాల పరీక్షల పేరుతో ఇక పిల్లల కోసం సరోగసి మాత్రమే ప్రత్యామ్నాయం అని చెబుతూ వారిని ఊబిలోకి దింపుతాయి. మహిళ గర్భసంచిలో లోపం ఉందని తేల్చినట్లు చెప్పి భర్త వీర్యంతో మరో మహిళ కడుపును అద్దెకు తీసుకునే ప్రతిపాదనను ముందుకు పెడతారు. తప్పనిసరి అన్న భావన కల్పించిన తరువాత ఇక దోపిడీ విధానానికి తెరలేపుతారు. మహిళ అద్దె గర్భాన్ని మూడు లక్షల వరకు ఇవ్వవలసి ఉంటుందని చెబుతారు.
ఆ తరువాత ఆమెకు పౌష్టికాహారం ఇవ్వకపోతే లోపాలతో కూడిన బిడ్డ పుడుతుందని చెప్పి మరో రెండు లక్షలు వసూలు చేస్తారు. మధ్యలో గర్భం మోస్తున్న మహిళకు జ్వరం/వ్యాధిగానీ వచ్చిందని అత్యవసర చికిత్స కోసం ఆమెను కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని చెప్పి మరికొంత సొమ్ము కాజేస్తారు. ఇక క్లైమాక్స్ లో దంపతులను దాదాపుగా బ్లాక్ మెయిలింగ్ విధానానికి పాల్పడతారు. తారు. గర్భాన్ని ధరించడం ఆమె భర్తకు ఇష్టం లేదని, అబార్షన్ చేయమంటున్నాడని చెబుతారు. అతనికి రెండు మూడు లక్షలు ఇవ్వకపోతే ఇబ్బందులు

పూర్తిగా మోసపూరితంగా జరుగుతుంది.
తప్పవని చెబుతారు. చివరి దశలో ఇక ఎందుకు ఇబ్బందులు.. అని వాటిని భరిస్తారు. తరువాత సాధారణ కాన్పు అసాధారణమని, బిడ్డ ఆరోగ్యంగా, బరువుగా ఉన్నాడని.. ఇలాంటి సమయంలో సిజేరియన్ తప్పదని చెబుతారు. తమ బిడ్డ కోసం వేరే మహిళను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక మళ్లీ రెండు మూడు లక్షలు చెల్లిస్తారు. ఇలా సుమారు ఒక్కొక్క జంట నుంచి 15 నుంచి 30 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తారు. కానీ ఇదంతా పూర్తిగా మోసపూరితంగా జరుగుతుంది. అసలు సరోగసీయే ఉండదు. పిల్లలను విక్రయించే ముఠాల నుంచిగానీ, నిరుపేదలైన దంపతుల నుంచి పిల్లలను సేకరిస్తారు. వారికి ఒకటి రెండు లక్షలు మాత్రమే ఇస్తారు. ఆ బిడ్డనే భర్త వీర్యంతో జన్మించాడని నమ్మబలికి అందిస్తారు. ఎవరైనా డిఎన్ఏ టెస్ట్ కావాలని చెబితే కాలయాపన చేసి వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. మరింత బలవంతం పెడితే అక్రమంగా తాము సరోగసి చేశామని ఆ కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుందని బ్లాక్మెయిల్ చేస్తారు.
ఇక రెండో విధానంలో భర్త వీర్యకణాలు సక్రమంగా లేవని చెప్పి వేరే వ్యక్తి వీర్యకణాలు భార్య పిండంలో ప్రవేశపెడతారు. ఇది కూడా ఒక మోసపూరిత చర్య. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువకుల నుంచి కాకుండా భిక్షగాళ్ల నుంచి వీర్యాన్ని సేకరిస్తారు. వీరికి వెయ్యి, రెండు వేల రూపాయలు మాత్రమే ముట్టజెబుతారు. ఇలా తప్పుడు మార్గాల్లో సేకరించిన వీర్యాన్ని భార్య పిండంలో ప్రవేశపెట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తారు. ఇంత తతంగం జరుగుతున్నా అధికారులు వీరిపై ఎలాంటి దృష్టి కేంద్రీకరించడం లేదు.
హైదరాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ కేంద్రంలో మోసం జరిగిన తరువాత వివిధ ఆసుపత్రుల్లో తనిఖీలు చేసినప్పుడు అక్కడ జరుగుతున్న ఘటనలు చూసి అధికారుల బృందం ఆశ్చర్యానికి గురౌతోంది. స్కానింగ్‌ల నుంచి ప్రతి అంశంలో లోపాలు గుర్తించారు. వైద్య సంస్థలు పేర్కొన్న వైద్యుల జాబితాయే మోసమని తేలింది. ఇకనైనా ఫెర్టిలిటీ కేంద్రాలపై ప్రభుత్వం తగిన దృష్టి సారించకపోతే మరిన్ని మోసాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
Read also:hindi.vaartha.com
Read also: